
వరస విజయాలతో దూసుకుపోతున్న నటి సమంత. పెళ్లి తర్వాత విభిన్న పాత్రలను ఎంపిక చేసుకొని విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది సమంత. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో పోషించిన చిత్రం యూటర్న్. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో సమంత, ఆది పినిశెట్టి కీలకపాత్రల్లో నటించారు. సమంత జర్నలిస్ట్‌గా కనిపించనుండగా.. ఆది పినిశెట్టి ఇన్వెస్టిగేషన్ అఫీసర్‌గా నటించారు. భూమిక, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
కిందటి నెల విడుదలైన యూటర్న్ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పూర్ణచంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ హైలైట్ కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్లపై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో సమంత తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామి కావడం విశేషం.
ఇక ఈ మూవీ టాక్ విషయానికి వస్తే.. కన్నడలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని స్టార్ హోదా ఉన్న హీరోయిన్ తెలుగులో రీమేక్ చేస్తుంటే మినిమిమ్ గ్యారంటీ ఉండగనే ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులకు చేరువకావడంతో నేడు విడుదలైన ‘యూటర్న్’ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రదర్శితం కావడంతో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులకు చేరువ అవుతుందంటూ ట్విట్టర్‌లో వరుస ట్వీట్స్ చేస్తున్నారు సమంత అభిమానులు.
ఫస్టాప్ బావుందని.. ఇక సెకండాఫ్ అదిరిపోయిందంటూ ఒకరు ట్వీట్ చేయగా.. అద్భుతమైన థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ‘యూటర్న్’ ఆకట్టుకుందంటున్నారు మరికొందరు.