శైలజా రెడ్డి అల్లుడు ట్విట్టర్ రివ్యూ

Published : Sep 13, 2018, 08:44 AM ISTUpdated : Sep 19, 2018, 09:24 AM IST
శైలజా రెడ్డి అల్లుడు ట్విట్టర్ రివ్యూ

సారాంశం

మారుతి దర్శకత్వం వహించిన ఈ ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్త గా రమ్యకృష్ణ, ఆమె కూతురుగా అను ఇమ్మాన్యుయల్ లు ప్రధాన పాత్రలు పోషించారు. 

అత్తా, అల్లుడు కాంబినేషన్ చిత్రాలు టాలీవుడ్ కి కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి లాంటి హీరోలు కూడా ఈ కోవలో సినిమాలు తీసి హిట్లు కొట్టారు. ఆ తర్వాత కూడా చాలా మంది హీరోలు ఇదే స్టోరీ లైన్ మీద సినిమాలు తీసి హిట్లు కొడితే.. మరికొందరు బోర్లా పడ్డారు. కాగా.. తాజాగా మరోసారి ఇలాంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగచైతన్య.

మారుతి దర్శకత్వం వహించిన ఈ ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్త గా రమ్యకృష్ణ, ఆమె కూతురుగా అను ఇమ్మాన్యుయల్ లు ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే కొందరు ఔత్సాహికులు సినిమా వీక్షించి ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

సినిమా ఏం బాగాలేదని, ఆశించిన స్థాయిలో లేదని ఒకరు ట్వీట్ చేశారు. తొలి భాగం డీసెంట్‌గా ఉందని, సెకండ్ హాఫ్ ఫుల్ కామెడీ అని మరొకరు ట్వీట్‌లో పేర్కొన్నారు. మారుతి తీవ్రంగానిరాశపరిచారని, రొటీన్ స్టఫ్‌తో చాలా బోరింగ్‌గా ఉందని ఇంకొకరు ట్వీట్ చేశారు. అయితే సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్ టాక్‌ను కావాలని స్ప్రెడ్ చేస్తున్నారని అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే