సమంతా కోసం మొత్తం మార్చేశారు!

First Published 30, May 2018, 11:01 AM IST
Highlights

'మహానటి' సినిమాలో జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంతా మంచి మార్కులే కొట్టేసింది. 

'మహానటి' సినిమాలో జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంతా మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పుడు మరోసారి జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన 'యూటర్న్'సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తోంది ఈ బ్యూటీ. కన్నడలో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన జర్నలిస్ట్ పాత్రలో సమంతా కనిపించనుంది. అయితే కన్నడ సినిమా చూసిన వారికి తెలుగు వెర్షన్ పెద్దగా థ్రిల్ చేయదేమోననే ఆలోచనతో కథను తెలుగు నేటివిటీకు తగ్గట్లు మార్చేశారట. ఒరిజినల్ కథకు తెలుగు రీమేక్ కు చాలా వేరియేషన్ ఉంటుందని దర్సకు పవన్ కుమార్ చెబుతున్నారు. 
క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం మార్చేసినట్లు వెల్లడించారు. ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కు కొత్త అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు. కన్నడ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు పవన్ కుమారే తెలుగు వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

Last Updated 30, May 2018, 11:01 AM IST