
ఊహకు అందనం భారీ బడ్జెట్‍తో గ్లోబల్ సినిమాగా ‘ప్రాజెక్ట్ కే’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్‍గా ప్రాజెక్ట్ కే రూపొందుతోంది. ప్రతిష్టాత్మక సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో అడుగుపెట్టనున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కే’ చరిత్ర సృష్టించనుంది. జూలై 19న ఈ ఈవెంట్‍లో ప్రాజెక్ట్ కే అఫీషియల్ టైటిల్, టీజర్‌ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.
అయితే, ఈలోగానే ప్రాజెక్ట్ కే టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. తమకు తోటిన టైటిల్స్ తో నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తున్నారు.‘ప్రాజెక్ట్ కే’లో ‘కే’ ఇదేనంటూ ట్వీట్లు చేస్తున్నారు. అలా, నాలుగు టైటిళ్లు ఎక్కువగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు రెండు టైటిల్స్ ఫైనలైజ్ చేసారని, అందులో ఒకటి ప్రకటించనున్నారు.
ఆ టైటిల్స్ ఏమిటంటే.. #KaalChakra కాలచక్ర ఇది పురాణాల నుంచి తీసుుకున్న పదం. కాలచక్రం అంటే సృష్ణి, వినాశనం. భగవత్గీతలో ఈ విషయం గురించి శ్రీకృష్ణుడు చెప్తారు. ఇంక మరో టైటిల్ #Kurukshetra. ఈ పదం కూడా బాగా పాపులర్ అయ్యిందే. మహాభారతంలోని యుద్దం జరిగిన ప్రదేశం. ఈ టైటిల్ ని కూడా మేకర్స్ పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం. మరి రెంటిలో దేన్ని అఫీషియల్ గా ప్రకటిస్తారో చూడాల్సి ఉంది. అయితే కాలచక్రం టైటిల్ కే ఎక్కువ మక్కువ చూపుతున్నారని వినికిడి.
ప్రాజెక్ట్ కే చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై సీహెచ్ అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. సంతోశ్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డోర్జే స్టోజిల్‍కోవిచ్.. ఈ చిత్రానికి పని చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. భారతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. ‘ప్రాజెక్ట్ కే’ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. హాలీవుడ్ సినిమాల్లా ప్రాజెక్ట్ కే సినిమాటిక్ యూనివర్స్‌గా ఉంటుందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే రెండో భాగంగా కూడా ఉండనుంది.