Sai Dharam Tej : పెళ్లిపై స్పందించిన సాయి ధరమ్ తేజ్.. అందరూ అలానే పిలుస్తున్నారంట..

By Asianet News  |  First Published Jul 16, 2023, 11:00 AM IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్త మరోసారి తెరమీదకి వచ్చింది. ఈసారి తేజూనే స్వయంగా తన మ్యారేజ్ పై స్పందించారు. రీసెంట్ ఈవెంట్ లో ఫన్నీ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.
 


రెండేళ్ల కింద సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా రోజులు బెడ్ కే పరిమితమయ్యారు. కోలుకున్నాక తన నెక్ట్స్ సినిమా ‘విరూపాక్ష’పై ఫోకస్ పెట్టారు. ఇటీవల ఈ చిత్రం విడుదలై సక్సెస్ అందుకుంది. రోటీన్ కు భిన్నమైన కథతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం తమిళంలో విజయవంతమైన ‘వినోదయ సీతమ్’కు రీమేక్ గా వస్తున్న ‘బ్రో’ చిత్రంలో నటిస్తున్నారు. ఈనెలలోనే ఈ చిత్రం విడుదల కానుంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్ గా, మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం Bro The Avatar. తమిళ స్టార్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఈచిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈనెల 28న అన్ని భాషల్లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక నిన్న ఈ చిత్రం నుంచి ‘జానవులే’ అనే బ్యూటీఫుల్ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ సందడి చేశారు. 

Latest Videos

తిరుపతిలో జరిగిన సెకండ్ సింగిల్ లాంచ్ కార్యక్రమంలో సాయి ధరమ్ తన పెళ్లిపై స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ అడగడంతో తేజూ మాట్లాడుతూ.. ఇంకెక్కడి పెళ్లి బ్రో... ఈ సినిమాకు ముందు ఎవర్నో ఒకరు ట్రై చేసేవారు. కానీ ఇప్పుడు అందరూ నన్ను ‘బ్రో’ అనే పిలుస్తున్నారు.. అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చి నవ్వులు పూయించారు. దీంతో ఇప్పట్లో సాయి ధరమ్ తేజ్ పెళ్లి లేదని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. 

ఇక రెండేళ్ల కింద యాక్సిడెంట్ కు గురైనప్పుడే సాయి ధరమ్ తేజ్ కు పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు భావించారంట. ఓ అమ్మాయిని కూడా ఎంపిక చేసి, తేజూపై ఒత్తిడి తెచ్చారని అప్పట్లో టాక్ వచ్చింది. కానీ అన్నీ సర్దుకున్నాకే చేసుకుంటానని సుప్రీమ్ హీరో తన నిర్ణయాన్ని చెప్పారంట. దాంటో పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ తర్వాత సాయి ధరమ్ తేజ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నారు. ఈయన వయస్సు ఇప్పుడు 36 ఏళ్లు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తేజూ పెళ్లిపై మరింత ఆసక్తినెలకొంది.

click me!