పరిశ్రమలో తీవ్ర విషాదం... ఇద్దరు హాస్య నటులు మృతి!

By team teluguFirst Published May 17, 2021, 10:17 AM IST
Highlights

రోజుల వ్యవధిలో అనేక మంది నటులు వివిధ కారణాలతో మరణించారు. ముఖ్యంగా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కోలీవుడ్ లో ఈ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది.

చిత్ర పరిశ్రమ అత్యంత గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి వలన ఏర్పడిన దుర్భర పరిస్థితులు పరిశ్రమపై ఆధారపడి న అనేక మంది కార్మికులు, నటులను కష్టాలపాలు చేస్తున్నాయి. పని లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే పరిశ్రమలో సంభవిస్తున్న వరుస మరణాలు మరింత క్రుంగ దీస్తున్నాయి. 

రోజుల వ్యవధిలో అనేక మంది నటులు వివిధ కారణాలతో మరణించారు. ముఖ్యంగా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కోలీవుడ్ లో ఈ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. వివేక్ వంటి స్టార్ కమెడియన్ గుండెపోటుతో మరణించడం తీవ్రంగా కలచివేసింది.

తాజాగా మరో ఇద్దరు కమెడియన్స్ ప్రాణాలు కోల్పోయారు. కమెడియన్  పొన్‌రాజ్‌ హఠాన్మరణం  పొందారు. వరుత్తపడాద వాలిబర్‌ సంఘం, రజనీ మురుగన్, ఆంటీ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి గుర్తింపు పొందిన ఈయన దర్శకుడు పొన్‌రామ్‌ వద్ద సహాయ దర్శకుడిగా కూడా పని చేశారు.కాగా పొన్‌రాజ్‌ శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన మృతికి వరుత్తపడాద వాలిబర్‌ సంఘం చిత్ర యూనిట్‌ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. 

అలాగే మరో కామెంట్ కమెడియన్  అయ్యప్పన్‌ గోపి కూడా ఇటీవల కన్నుమూశారు. కె.బాలచందర్‌ 'జాతిమల్లి' చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. సూర్య 'ఆరు' చిత్రం నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అలాంటి అయ్యప్పన్‌ గోపి మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.

click me!