కరోనా బాధితులకు నవీన్ పోలిశెట్టి మానసిక వైద్యం!

Published : May 16, 2021, 05:42 PM ISTUpdated : May 16, 2021, 05:44 PM IST
కరోనా బాధితులకు నవీన్ పోలిశెట్టి మానసిక వైద్యం!

సారాంశం

ప్రియమైన వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తను ఊహించగలనని, ఇలాంటి కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పారు. కరోనా కష్టాల్లో ఉన్న వారితో మాట్లాడి, మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి అందరికీ విజ్ఞప్తి చేశారు.

యంగ్ స్టార్ నవీన్ పోలిశెట్టి తన అభిమానులకు అండగా నిలుస్తున్నారు. తన మాటలతో వారికి ఓదార్పునిస్తున్నారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన అభిమానులతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. ఈ కష్టకాలంలో వారికి కావాల్సిన మానసిక స్థైర్యాన్ని అందిస్తున్నారు.

ఇటీవల సాయి స్మరణ్ అనే నవీన్ పోలిశెట్టి అభిమాని తండ్రి కరోనాతో కన్నుమూశారు. సాయి స్మరణ్ తల్లి ఈ బాధతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆమె మనసు వేరే పనుల మీదకు మరల్చేందుకు "జాతిరత్నాలు" సినిమాను తల్లికి చూపించాడు సాయి స్మరణ్. ఆ సినిమా చూస్తూ మనసు తేలిక చేసుకుందా తల్లి. ఈ విషయాన్ని నవీన్ పోలిశెట్టికి ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు సాయి స్మరణ్. నవీన్ పోలిశెట్టి వెంటనే మదర్ తో ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. 

ప్రియమైన వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తను ఊహించగలనని, ఇలాంటి కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పారు. కరోనా కష్టాల్లో ఉన్న వారితో మాట్లాడి, మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి అందరికీ విజ్ఞప్తి చేశారు.

PREV
click me!

Recommended Stories

Save The Tigers 3 First Review: సేవ్‌ ది టైగర్స్ సీజన్‌ 3 ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?
Rashmika Mandanna: జీవితంలో బెస్ట్ నిర్ణయం అదే.. విజయ్ దేవరకొండ గురించి రష్మిక వైరల్ కామెంట్స్