
అభిమానులు మాత్రమే కాకుండా యావత్ సినీ లవర్స్ అంతా ఎదురు చూస్తోన్న చిత్రం “ఆర్ఆర్ఆర్”.ఈ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ షురూ అయ్యింది. మరి కొద్ది గంటల్లో “ఆర్ఆర్ఆర్” హంగామా ఓ రేంజిలో పీక్స్ కు వెళ్లనుంది. ఈ నేపధ్యంలో ఫ్యాన్స్ మొదలుకుని ట్రేడ్ ఎక్సపర్ట్స్ వరకు ఈ సినిమా ఫస్ట్ డే సృష్టించబోయే సంచలనాలను లెక్కేసే పనిలో ఉన్నారు. మరో ప్రక్క ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి ఇప్పటికే పదుల సంఖ్యలో రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ తేజలు ఇంటర్వూలు ఇచ్చేసారు. ప్రతీ ఇంటర్వూలోనూ ఏదో ఒక కొత్త విషయం చెప్తూ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ ఈ సినిమాలో రెండు హైలెట్స్ గురించి డిస్కషన్ మొదలైంది.
అది మరేదో కాదు...ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి. ఇప్పటిదాకా మనకు ప్రమోట్ అయ్యిన దాన్ని బట్టి “ఆర్ ఆర్ ఆర్” సినిమా ఒక యాక్షన్ డ్రామా. సినిమాలో రొమాంటిక్ సీన్స్ కు అవకాసంలేదు. డ్యూయిట్స్ ఉండవు. మరి అంతా యాక్షనేనానా? ఈ విషయమై రాజమౌళి ఓ ఇంటర్వూలో క్లారిటీ ఇచ్చారు. “ఈ సినిమాలో ఎమోషన్ ప్రధానం. ఫైట్ సన్నివేశాల్లోనూ ఎమోషన్ ఉంటుంది. సినిమా మొత్తం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉంటారు. వారి స్నేహం, వారి లక్ష్యం ఈ కథకి బలం,” అని రాజమౌళి చెప్పారు. అలాగే సినిమా అంతా ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటుందని చెప్పిన జక్కన్న మాటలు ప్రస్తుతానికి సినిమా చూడాలన్న ఉత్సాహాన్ని ఆడియన్స్ కు పెంచుతున్నాయి.
అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడిక్షన్, ఎన్టీఆర్ ఇంట్రడిక్షన్ మెయిన్ హైలెట్స్ . వీటితో పాటు రెండు ఫైట్స్ ఈ సినిమాకి కేక పెట్టించేలా డిజైన్ చేసారనే మాట వినిపిస్తోంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ సినిమా మొత్తానికే హైలెట్. మనకు గతంలో రాజమౌళి డైరక్ట్ చేసిన ఛత్రపతి, మగధీర, బాహుబలిని మించే స్దాయిలో … ఈ సినిమాలో కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండబోతోందట. మరో హైలెట్ ఏమిటంటే... సినిమాలో చివరి 20 నిముషాలు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లయిమాక్స్ దాగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్. మామూలుగా ఉండదట. అది చూసాక సినిమా మళ్లీ చూడాలనిపిస్తుందిట. ఈ రెండు హైలెట్స్ చాలు భాక్సాఫీస్ బ్రద్దలు కావడానికి అని చెప్తున్నారు. ఈ మాటలో నిజమెంత అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో.. అజయ్ దేవగన్, శ్రియ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. . ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చింది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్,రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే యూఎస్‌లో ఎన్టీఆర్ ఓ అభిమాని ఏకంగా థియేటర్ నే బుక్ చేయడం విశేషం.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే ముందు రోజు రాత్రి నుంచి స్పెషల్ షోస్ వేయనున్నారు. ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.