Salman Khan Controversy: మరో వివాదంలో సల్మాన్‌ ఖాన్‌.. కోర్ట్ సమన్లు జారీ

Published : Mar 24, 2022, 06:56 AM IST
Salman Khan Controversy: మరో వివాదంలో సల్మాన్‌ ఖాన్‌.. కోర్ట్ సమన్లు జారీ

సారాంశం

ఇప్పటికే కృష్ణజింక వేటాడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. జర్నలిస్ట్ ని బెదిరించిన కేసులో కోర్ట్ సమన్లు అందుకున్నారు.

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసు చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా మరో వివాదం ఆయన్ని వెంటాడుతుంది. జర్నలిస్ట్ ని బెదిరించిన కేసులో ఆయనకు కోర్ట్ సమన్లు జారీ చేసింది. ఆయనతోపాటు ఆయన బాడీ గార్డ్ పై కూడా కేసు నమోదైంది. మరి ఇంతకి ఏం జరిగింది? ఎలా సల్మాన్‌ ఈ కేసులో ఇరుక్కున్నాడనేది చూస్తే. 

Salman Khan ఓ జర్నలిస్ట్ పై దాడి వివాదంలో ఇరుక్కున్నాడు. ఇది 2019లో సంచలనం సృష్టించింది. సల్మాన్‌ ముంబయి రోడ్డలపై సైక్లింగ్‌ చేస్తుండగా, తన ఫోన్‌ లాక్కున్నారని జర్నలిస్ట్ అశోక్‌ పాండే ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియా ఆయన్ని ఫోటోలు తీస్తున్నారని, ఈ క్రమంలోనే సల్మాన్‌ ఖాన్‌, ఆయన బాడీ గార్డ్ తన దగ్గరికి వచ్చి ఫోన్‌ లాక్కొని బెదిరించినట్టు అశోక్‌ పాండే తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కేసులో సల్మాన్‌పై, ఆయన బాడీగార్డ్ నవాజ్‌ షేక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అశోక్‌ పాండే కోర్ట్ ని ఆశ్రయించారు. 

జర్నలిస్ట్ ఫిర్యాదులో తాజాగా అంథేరి కోర్ట్ సల్మాన్‌కి, ఆయన బాడీగార్డ్ కి సమన్లు పంపించింది. ఈ ఘటనపై విచారణ జరిపించాలని లోకల్‌ పోలీసులను కోర్ట్ ఆదేశించింది. అయితే దీనిపై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ సల్మాన్‌, ఆయన బాడీగార్డ్ కి ప్రతికూలంగా ఉంది.  ఈ నేపథ్యంలో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆర్‌ఆర్‌ ఖాన్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం సల్మాన్‌, ఆయన బాడీ గార్డ్ పై ఐపీసీ సెక్షన్‌ 504, 506కింద కేసు నమోదైనట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంధేరీ కోర్టు వారికి నోటిసులు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్‌ 5కి వాయిదా వేసింది. 

ఇక సల్మాన్‌ ఖాన్‌ తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల `అంతిమ్‌` చిత్రంతో అదరగొట్టిన సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం `కభీ ఈడ్‌ కభీ దివాలీ`, `టైగర్‌ 3` చిత్రాల్లో నటిస్తున్నారు. షారూఖ్‌ ఖాన్‌ `పఠాన్‌`లో గెస్ట్ రోల్‌చేస్తున్నారు. మరోవైపు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు సల్మాన్‌. చిరంజీవి నటిస్తున్న `గాడ్‌ ఫాదర్‌` సినిమాలో గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. ముంబయిలో చిత్రీకరణ జరుపుకుంటుండగా, సల్మాన్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. చిరు, సల్మాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా