అతడు ఆపని చేస్తున్నాడు.. ఈమె సెల్ఫీ కొట్టుకుంది

Published : Aug 19, 2017, 07:34 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
అతడు ఆపని చేస్తున్నాడు.. ఈమె సెల్ఫీ కొట్టుకుంది

సారాంశం

టాయిలెట్ వినియోగంపై ట్వింకిల్ ఖన్నా ట్వీట్ బహిరంగ మలవిసర్జనకు పాల్పడుతున్నోడితో సెల్ఫీ తను తీసుకున్న సెల్ఫీని ట్విటర్ లో పోస్ట్ చేసిన ట్వింకిల్ ఖన్నా

బాలీవుడ్ స్టార్ కపుల్ లో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా జంట ఒకటి. సామాజిక చైతన్యం తెచ్చే దిశగా వీళ్లిద్దరూ తమదైన పాత్రలు పోషిస్తూ.. వీడియోలు ఇతరత్రాల్లో కనిపిస్తుంటారు. రీసెంట్ గా ట్వింకిల్ ఖన్నా ఓ బోల్డ్ ట్వీట్ పెట్టింది. ఒక వ్యక్తి బహిరంగ మలవిసర్జనకు పాల్పడుతున్నప్పుడు స్వయంగా సెల్ఫీ తీసుకుంది ట్వింకిల్. అంతేకాదు..టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా పార్ట్ 2లో మొదటి సీన్ ఇదే అనుకుంటున్నానంటూ ఆ సెల్ఫీని ట్వీట్ చేసింది. ఆ సెల్ఫీ చూసిన వారికి ట్వింకిల్ సామాజిక స్పృహపై ప్రశంసలు కురిపించాలనిపించక తప్పదు. 71 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఇలా బహిరంగంగా చేస్తున్నవారికి సిగ్గుతో తలదించుకునేలా అనేకంటే... చెంప ఛెళ్లుమనిపించేలా... ట్వింకిల్ ట్వీట్ చేసింది. హేట్సాఫ్.

 

 

PREV
click me!

Recommended Stories

ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ.. కృష్ణ చేసిన ఫస్ట్ సినిమా ఏదో తెలుసా? రామారావు ఏమన్నాడంటే?
ఆ సినిమాలో హీరో నేనే అంటే.. నిర్మాత చేయనన్నాడు.. ధనరాజ్