
బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ రాజేష్ ఖన్నా; ఫేమస్ నటి డింపుల్ కపాడియా కూతురు ట్వింకిల్ ఖన్నా. గతంలో ట్వింకిల్ ఖన్నా బాలీవుడ్ లో తన అభినయంతో చాలా మంది అభిమానులనను సంపాదించుకుంది. కానీ 2001 నుంచి తాను సినిమాలకు స్వస్త పలికింది. అప్పటి నుంచి సినిమాల్లో కనిపించడం లేదు.
కానీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. పండుగలు, పలు రకాల అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో తను స్వీట్స్ తినేందుకు ఎంత ఇబ్బంది పడుతుందో.. లడ్డూలను తినకుండా ఉండేందుకు చాలా కష్టపడుతుందోంది. తన రిలీజ్ చేసిన వీడియోలో ఒక టేబుల్ పై ఉన్న లడ్డూలను చూస్తూ ఒక పాట పాండింది.
ఈ పాట వింటే ఎవ్వరికైనా నవ్వు రాకా ఆగదు. ఎందుకంటే స్వీట్ తినాలనే ఆశతో పాటలను పాడుతూ ఉండే వారిని చూశాం కానీ, తినకూడదనే ఉద్దేశంతో పాటలు పాడిన మొదటి వ్యక్తి బహూశ ‘ట్వింకిల్ ఖన్నా’నే అనుకోవచ్చు.
టేబుల్ ముందు ఉన్న లడ్డూలను చూస్తూ చేతిలో ఒక కప్ ఆఫ్ కాఫీతో కనిపిస్తున్న ఈ వీడియోలో తాను పాడిన పాట 1991లో రిలీజైన ‘సజన్’ మూవీలోనిది. కాగా ‘మేరా దిల్ బీ కిత్నా పాగల్ హే’ అంటూ ఖన్నా పాడిన పాట తనకు లడ్డూల మీద ఉన్న ప్రేమను, లడ్డూను తినకుండా తన నోటిని దారి మళ్లించే ప్రయత్నం కనిపిస్తాయి. అయితే ఎంత మంది ఇలా పాడగలరని, మీరు ఎంత భయకరంగా పాడుతారని తెలిసినా పాడగలరని ప్రశ్నించింది.