దుల్కర్ సల్మాన్ కు కోవిడ్ పాజిటివ్.. మహమ్మారి ఇంకా అంతం కాలేదు అంటూ పోస్ట్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 21, 2022, 11:25 AM IST
దుల్కర్ సల్మాన్ కు కోవిడ్ పాజిటివ్.. మహమ్మారి ఇంకా అంతం కాలేదు అంటూ పోస్ట్

సారాంశం

మహమ్మారి కరోనా అంతకంతకు తన ప్రతాపం పెంచుకుంటూ పోతోంది. సెలెబ్రిటీలు వరుసగా కరోనా బారీన పడుతున్నారు. ఇప్పటికే సౌత్ లో చాలా మంది నటీనటులు కోవిడ్ సోకడంతో చికిత్స పొందుతున్నారు. 

మహమ్మారి కరోనా అంతకంతకు తన ప్రతాపం పెంచుకుంటూ పోతోంది. సెలెబ్రిటీలు వరుసగా కరోనా బారీన పడుతున్నారు. ఇప్పటికే సౌత్ లో చాలా మంది నటీనటులు కోవిడ్ సోకడంతో చికిత్స పొందుతున్నారు. హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు కూడా కరోనా సోకింది. 

దీనితో దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించాడు. 'నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. కొద్దిగా జ్వరం, స్పల్ప లక్షణాలు ఉన్నాయి. అవి తప్ప నేను బాగానే ఉన్నాను. గత కొన్ని రోజులుగా నాతో షూటింగ్ లో కాంటాక్ట్ లో ఉన్న వారు వెంటనే టెస్ట్ చేయించుకోండి. లక్షణాలు కనిపిస్తే ఐసొలేషన్ లో ఉండండి. ఈ పాండమిక్ ఇంకా ముగియలేదు. కాబట్టి అందరం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి అంటూ దుల్కర్ సల్మాన్ విజ్ఞప్తి చేశారు. 

ఇదిలా ఉండగా దుల్కర్ సల్మాన్ చివరగా కురుప్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా ఈ చిత్రంలో దుల్కర్ తన నటనతో అదరగొట్టాడు. దుల్కర్ పెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడిప్పుడే దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువవుతున్నారు. 

సావిత్రి బయోపిక్ మహానటి చిత్రంలో దుల్కర్ జెమినీగణేశన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. అలాగే దుల్కర్ నటించిన కనులు కనులని దోచాయంటే చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెన్సార్‌ రివ్యూ.. పవన్‌ సినిమాని ఎవరు చూడొచ్చు, నిడివి ఎంత అంటే?
Senior NTR: సీనియర్ ఎన్టీఆర్ గురువుగా భావించింది.. అదే సమయంలో ఆయన్నే ముద్దుగా పిలిచింది..