ట్విన్ బ్రదర్స్ ఇద్దరూ ఐపీఎస్ అధికారులే.. సూర్య 'సింగం'తో పోల్చుతున్న నెటిజన్లు, వైరల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 03, 2022, 02:47 PM IST
ట్విన్ బ్రదర్స్ ఇద్దరూ ఐపీఎస్ అధికారులే.. సూర్య 'సింగం'తో పోల్చుతున్న నెటిజన్లు, వైరల్

సారాంశం

అరవిందన్ అనే ఐపీఎస్ అధికారి తన కవల సోదరుడు అభినందన్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా నెటిజన్లని ఆశ్చర్యపరుస్తూ వైరల్ గా మారింది.

కవలలు ఇద్దరూ సైంటిస్ట్ లు కావడం.. ఇద్దరూ డాక్టర్లు కావడం లాంటి అద్భుతాలు ఎక్కువగా సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా అలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. కవలలు ఇద్దరూ ఐపీఎస్ అధికారులు అయిన అద్భుతం ఇది. 

అరవిందన్ అనే ఐపీఎస్ అధికారి తన కవల సోదరుడు అభినందన్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా నెటిజన్లని ఆశ్చర్యపరుస్తూ వైరల్ గా మారింది. ఇద్దరూ అచుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు. ఇద్దరూ ఖాఖీ డ్రెస్సులో అదిరిపోయేలా ఫోజు ఇచ్చారు. 'తమిళనాడు పోలీస్ ఢిల్లీ ఫోలీస్ ని కలిసిన వేళ.. నా కవల సోదరుడు అభినందన్ తో' అంటూ అరవిందన్ పోస్ట్ చేశాడు. 

దీనితో నెటిజన్లు ఈ పోస్ట్ ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇద్దరినీ సూర్య సింగం చిత్రంతో పోల్చుతూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది నెటిజన్లు వీరిద్దరూ ఒకరికొకరు డూప్ లాగా కనిపిస్తున్నారు. గుర్తు పట్టడం కష్టం అని కామెంట్స్ చేస్తున్నారు. 

అరవిందన్ తమిళనాడులో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు. అరవిందన్ తన కార్యాలయంలో ఎస్ఎంఎస్ అలెర్ట్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తన విధుల్లో పరిచయం చేశారు. సైబర్ ఫ్రాడ్ లు జరగకుండా అరవిందన్ ఎంతో చైతన్యం తీసుకువచ్చారు. 

ఇక తన సోదరుడు అభినందన్ ఢిల్లీలో ఎసిపి గా విధులు నిర్వహిస్తున్నారు. ఫైనాన్స్ మినిస్ట్రీ లాంటి శాఖలో అభినందన్ పనిచేశారు. 

 

PREV
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు