Kushboo Bussy In Tollywood:టాలీవుడ్ లో బిజీ అవుతున్న కుష్బు.. మాజీ హీరోయిన్ ఖాతాలో మరో సినిమా..

Published : Mar 03, 2022, 02:21 PM IST
Kushboo Bussy In Tollywood:టాలీవుడ్ లో బిజీ అవుతున్న కుష్బు.. మాజీ హీరోయిన్ ఖాతాలో మరో సినిమా..

సారాంశం

నిన్నటి తరం హీరోయిన్లలో తెలుగు తెరపై మెరిసివారిలో కుష్బు ఒకరు. క్యారెక్టర్ రోల్స్ బిజీ బిజీ అయిపోయిన కుష్బు.. టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.   

మరోసారి టాలీవుడ్ లో తన హవా చూపించబోతోంది సీనియర్ హీరోయిన్ కుష్బు. తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నిన్నటి తరం హీరోయిన్ ఖుష్బు. వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖుష్బూ, మొదటి సినిమాతోనే గ్లామర్ పరంగా .. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయింది తమిళ బ్యూటీ.  తెలుగులో మంచి మంచి ఆఫర్లు అప్పట్లోనే కొట్టేసింది  

అప్పట్లో కోలీవుడ్ బిజీ హీరోయిన్లలో కుష్బు కూడా  ఒకరు. తెలగులో  కిరాయి దాదా తో మరో హిట్ ను ఆమె అందుకుంది. దాంతో తెలుగు నుంచి వరుస అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అయితే  తమిళ సినిమాలతో బిజీగా ఉండటం వలన ఆమె ఎక్కువగా తెలుగు సినిమాలను  చేయలేకపోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఆ ఛాన్స్ మిస్ చేసుకోను అంటుంది. కాని ఇప్పుడు హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తుంది కుష్బు. అందుకే వచ్చి ప్రతీ ఛాన్స్ ను వదులుకోకుండా అందిపుచ్చుకుంటుంది. 

నిజానికి టాలీవుడ్ లోకి  స్టాలిన్  సినిమాతో కేరక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చింది కుష్బు. ఈసినిమాలో చిరంజీవి అక్కగా కనిపించింది.  ఆ తరువాత యమదొంగ, అజ్ఞాతవాసి లాంటి  సినిమాలలో ఇంపార్టెంట్  రోల్స్ పోషించింది. స్టాలిన్ లో చిరు అక్కగా నటించిన కుష్బు.. అజ్ఞాతవాసి సినిమాలో పవర్ స్టార్ తల్లిగా నటించింది. ఇక ఈ సినిమా నుంచే ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది.  రీసెంట్ గా ఆమో నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు రేపు ( మార్చి 4) న రిలీజ్ కాబోతోంది. ఈ  సినిమాలోను ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. 

ఇక తెలుగులో ఆమెను వరుస అవకాశాలు వరిస్తున్నట్ట తెలుస్తోంది. ముక్కంగా గోపీచంద్ హీరోగా  శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో కుష్బు కీ రోల్ చేయబోతుంది. గోపీచంద్ హీరోగా ఈ సినిమా షూటింగు జరుపుకుంటోంది. ఈ షూటింగుకి వెల్ కమ్ చెబుతూ ఈ సినిమా టీమ్ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. విశ్వప్రసాద్ తో కలిసి  వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ మూవీ గోపించ్  30 సినిమాగా తెరకెక్కుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు