Casting Couch : కాస్టింగ్ కౌచ్ పై నోరువిప్పిన బాలీవుడ్ సీనియర్ నటి ఇషా కొప్పికర్..

Published : Mar 03, 2022, 02:15 PM ISTUpdated : Mar 03, 2022, 02:33 PM IST
Casting Couch : కాస్టింగ్ కౌచ్ పై నోరువిప్పిన బాలీవుడ్ సీనియర్ నటి ఇషా కొప్పికర్..

సారాంశం

మీ టూ (MeToo Movement) సోషల్ మూమెంట్ తర్వాత యాక్ట్రెస్ కాస్టింగ్ కౌచ్ పై ధైర్యంగా నోరు విప్పుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి స్పందించారు. తాజాగా కింగ్ నాగార్జున హీరోయిన్ ఇషా కొప్పికర్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు.     

చలన చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ బాధితులు చాలానే మంది ఉన్నారని చెప్పొచ్చు. మీ టూ యుద్ధం తర్వాత ఇటీవల కాలంలో కాస్టింగ్ కౌచ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. స్టార్‌ హీరోయిన్స్‌ నుంచి క్యారెక్టర్‌ అర్టిస్ట్‌ల వరకు తమకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేస్తున్నారు. సుచి లీక్స్‌, సింగర్‌ చిన్మయ్‌ శ్రీపాద వివాదం నుంచి కాస్టింగ్‌ కౌచ్‌ బాధితులు ఒక్కొరుగా బయటకు వచ్చి నోరు విప్పుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, సీనియర్ నటి ఇషా కొప్పికర్ (Isha Koppikar) స్పందించారు.  

ఇషా కొప్పికర్  కింగ్ నాగార్జున సరసన ‘చంద్రలేఖ’ మూవీలో  హీరోయిన్‌ గా నటించారు.  ఈ మూవీతనకు టాలీవుడ్ లో తొలిచిత్రం. ఆ తర్వాత ‘ప్రేమతో రా’ మూవీలో మెరిసింది. చివరిగా హీరో నిఖిల్ (Nikil) నటించిన ‘కేశవ’ చిత్రంలో ఓ కీల్ రోల్ ప్లే శారు నటి ఇషా కొప్పికర్.  ఆ తర్వాత పలు వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ఈషా కొప్పికర్‌ సైతం కాస్టింగ్‌ కౌచ్‌పై పెదవి విప్పింది.   

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తను కాస్టింగ్‌ కౌచ్‌ పై మాట్లాడారు. తను కూడా బాధితురాలినే అని తెలిపారు. ‘చదువుకుంటున్న రోజుల్లో పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌ చేశాను. దీంతో నాకు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ‘ఏక్‌ థా దిల్‌ థా ధడ్కన్‌’ మూవీలో ఆఫర్‌ వచ్చింది. ఈ మూవీలో నటించడంతో నాజీవితం హీరోయిన్‌గా మలుపు తిరిగింది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ నిర్మాత ఫోన్‌ చేసి అవకాశం ఉందని చెప్పాడు. కానీ  మొదట హీరోని కలవాలి అని చెప్పాడు. సరేనని.. ఆ తర్వాత హీరోకి కాల్‌ చేయగా..  ‘మీరు ఒంటరిగా రండి. ఏకాంతంగా కలుద్దాం. మీతో పాటు మీ స్టాప్‌ ఎవరు ఉండకూడదు’ అన్నట్టు  చెప్పుకొచ్చింది.

 ఆ తర్వాత విషయం అర్థం చేసుకొని ఆ సినిమాకు నో చెప్పినట్టుగా తెలిపారు.  ‘ఏక్‌ థా దిల్‌ ఏక్‌ థా ధడ్కన్‌’తో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషా కొప్పికర్‌. ఆ తర్వాత వరస ఆఫర్లు అందుకుంది. ఈమె తెలుగు, కన్నడ, తమిత చిత్రాల్లోనూ నటించింది.  ఇటీవల కాస్టింగ్ కౌచ్ పైనా స్వీటీ అనుష్క శెట్టి (Anushka Shetty) కూడా స్పందించిన విషయం తెలిసిందే.  నాగార్జున హీరోగా 2005లో విడుదలైన సూపర్ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది. ఇన్నేళ్ల కెరీర్ లో విమర్శలపాలైన సందర్భాలు లేవు. ఒకటి రెండు లవ్ ఎఫైర్  రూమర్స్ వచ్చినా... అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. కాస్టింగ్ కౌచ్ పై ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ ‘టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ (Casting couch)ఉందన్నారు.  అవకాశాలు ఆశచూపి అమ్మాయిలను లొంగదీసుకుంటున్నారని, తన కెరీర్ బిగినింగ్ లో తనకూడా చూసినట్టు చెప్పారు. కానీ అలాంటి ఇబ్బందులు తనకు ఎదురు కాలేదని చెప్పింది.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే