సోనియా ఆకులకు అక్కడ కూడా నిరాశే, నాలుగు వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

By Sambi ReddyFirst Published Sep 30, 2024, 7:47 AM IST
Highlights

ఫైనల్లీ సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యింది. నాలుగు వారాల్లోనే ఆమె జర్నీ ముగిసింది. నటి సోనియా రెమ్యూనరేషన్ డిటైల్స్ చూద్దాం.. 
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన సీజన్ 8లో ప్రస్తుతం 10 మంది ఉన్నారు. బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా వరుసగా బిగ్ బాస్ హౌస్ ని వీడారు. 

సోనియా ఆకులపై అత్యంత నెగిటివిటీ ఉంది. అయినప్పటికీ ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతుందని భావించలేదు. ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యులు సైతం ఆమెకు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో బయటకు రాక తప్పలేదు. 

ఉత్కంఠగా ఎలిమినేషన్ 

Latest Videos

నాలుగో వారానికి గాను ఆరుగురు నామినేట్ అయ్యారు. సోనియా ఆకుల, నాగ మణికంఠ, నబీల్, ఆదిత్య ఓం, పృథ్విరాజ్, ప్రేరణ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. నబీల్ శనివారమే సేవ్ అయ్యాడు. మెజారిటీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో నబీల్ హీరో అని అతనికి కిరీటం పెట్టారు. దాంతో నబీల్ కలలోకి వచ్చిన కబాబ్ ని నాగార్జున బహుమతిగా ఇచ్చాడు. 

అలాగే మెజారిటీ కంటెస్టెంట్స్ నాగ మణికంఠను జీరో అని తేల్చారు. ఈ కారణంగా అతడు నేరుగా డేంజర్ జోన్లోకి వెళ్ళాడు. ఆదివారం ప్రేరణ, పృథ్విరాజ్ సైతం సేవ్ అయ్యారు. మిగిలిన ముగ్గురిలో ఆదిత్య ఓం మరోసారి ఎలిమినేషన్ నుండి తప్పుకున్నాడు. 

ఆదిత్య, సోనియా ముందు ఫిష్ ట్యాంక్ పెట్టిన నాగార్జున. ఎవరి ఫిష్ ట్యాంక్ అయితే రెడ్ కలర్ లోకి మారుతుందో వారు నాట్ సేఫ్, గ్రీన్ కలర్ కనిపిస్తే ఆ కంటెస్టెంట్ సేఫ్ అవుతారని చెప్పాడు. సోనియా ఫిష్ ట్యాంక్ లో రెడ్ కలర్ కనిపించింది. దాంతో ఆదిత్య సేఫ్ అయ్యాడు.

ఇక నాగ మణికంఠ, సోనియాలలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ప్రేక్షకులు లీస్ట్ ఓటింగ్ తో సోనియాను ఎలిమినేట్ చేశారన్న.. నాగార్జున హౌస్ మేట్స్ అభిప్రాయం కూడా తీసుకున్నారు. మణికంఠ, సోనియాలలో ఎవరు బయటకు వెళ్లాలని భావిస్తున్నారని అని అడగ్గా.. నిఖిల్, పృథ్వి, నైనిక.. సోనియాకు అనుకూలంగా ఓటు వేశారు. మిగతా కంటెస్టెంట్స్ మణికంఠ హౌస్లో ఉండాలని కోరుకున్నారు. దాంతో సోనియా ఎలిమినేట్ అయ్యింది. 

సోనియా ఎలిమినేషన్ వెనుక రీజన్స్

ప్రేక్షకులు నిజాయితీగా గేమ్ ఆడేవారిని మాత్రమే సపోర్ట్ చేస్తారు. మొదటి వారం నుండి పరిశీలిస్తే ... సోనియా గేమ్ లో నిజాయితీ  కనిపించలేదు. ఫేక్ ఎమోషన్స్, ఫేక్ రిలేషన్స్ ఆమె కొనసాగిస్తోంది. అత్యంత సన్నిహితంగా ఉండే నిఖిల్ ని ఉద్దేశించి కూడా ఇతర కంటెస్టెంట్స్ తో తప్పుగా మాట్లాడుతుంది, ఆరోపణలు చేస్తుంది. 

కంటెస్టెంట్స్ ని పర్సనల్ గా టార్గెట్ చేయడం కూడా సోనియాకు మైనస్ అని చెప్పాలి. విష్ణుప్రియపై సోనియా వ్యక్తిగత ఆరోపణలు చేసింది. నీ డ్రెస్సింగ్ అసభ్యకరంగా ఉంటుంది. అడల్ట్ జోక్స్ వేస్తావు, అడల్ట్ కంటెంట్ ఇస్తున్నావు. నీకు ఫ్యామిలీ లేదంటూ ఘాటైన విమర్శలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ ప్రవర్తన, గేమ్ పై విమర్శలు చేయవచ్చు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని ప్రేక్షకులు సహించరు. 

సోనియా యాటిట్యూడ్, బిహేవియర్ సైతం అభ్యంతరకరంగా ఉంటున్నాయి. పృథ్విరాజ్, నిఖిల్ తో ఆమె ప్రవర్తన చాలా అసభ్యంగా తోస్తుంది. మేల్ కంటెస్టెంట్స్ తో సోనియా ఇబ్బందికర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోనియా పై అందుకే విపరీతమైన నెగిటివిటి నడిచింది. 

సోనియా రెమ్యూనరేషన్ 

సోనియా ఆకులకు పెద్దగా పాపులారిటీ లేదు. ఆమె కోరి బిగ్ బాస్ షోకి వచ్చింది. బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ రెండు రకాలుగా ఉంటుంది. నిర్వాహకులు స్వయంగా కొందరు సెలెబ్స్ ని సంప్రదిస్తారు. వారు ఆసక్తి ఉంది అంటే, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. నిర్వాహకులు సంప్రదించిన సెలెబ్స్ కి డిమాండ్ ఉంటుంది. వారు పెద్ద మొత్తంలో  రెమ్యూనరేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. బేరసారాలు ఆడొచ్చు. 

రెండో ఎంపిక విధానంలో కొందరు సెలెబ్స్ స్వయంగా బిగ్ బాస్ నిర్వాహకులను సంప్రదిస్తారు. తమకు ఆసక్తి ఉందని తెలియజేస్తారు. పెద్దగా ఫేమ్ లేని సెలెబ్స్ ఇలా చేసే అవకాశం ఉంది. బిగ్ బాస్ షో వలన వెలుగులోకి రావచ్చని ఆశపడతారు. సోనియా ఆకుల అదే విధంగా సీజన్ 8లో కంటెస్ట్ చేసిందని సమాచారం. 

కాగా ఎవరికైనా కూడా చెప్పుకోదగ్గ రెమ్యూనరేషన్ అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ఇస్తారట. అది లక్షల్లోనే ఉంటుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సోనియా వారానికి రూ. 1.5 లక్షల ఒప్పందం పై హౌస్లో అడుగుపెట్టిందట. ఆ లెక్కన నాలుగు వారాలకు సోనియాకు రూ. 6 లక్షలు ముట్టాయని సమాచారం. 

ఎవరీ సోనియా ఆకుల?

సోనియా ఆకుల తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో గల గాజుళ్లపల్లి అనే ఓ గ్రామంలో పుట్టింది. బి.టెక్ పూర్తి చేసిన సోనియా.. నటనపై మక్కువతో పరిశ్రమలో అడుగు పెట్టింది. జార్జి రెడ్డి చిత్రంలో మొదటిసారి నటించింది. ఆ మూవీలో హీరో సిస్టర్ రోల్ చేసింది. 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన కరోనా వైరస్, ఆషా ఎన్ కౌంటర్ చిత్రాల్లో సోనియా ప్రధాన పాత్రలు చేసింది. ఇవి రెండు నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కాయి. ఆ చిత్రాలకు ఆదరణ దక్కకపోవడంతో సోనియాకు గుర్తింపు రాలేదు. 
 

click me!