సోనియా ఎలిమినేషన్ వెనుక షాకింగ్ రీజన్స్! అదే కొంపముంచిందా?

By Sambi ReddyFirst Published Sep 29, 2024, 11:39 AM IST
Highlights

సోనియా ఆకుల బిగ్ బాస్ ఇంటిని వీడటం అనివార్యమే అంటున్నారు. ఈ క్రేజీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం వెనుకనున్న షాకింగ్ రీజన్స్ ఏమిటో చూద్దాం
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన రియాలిటీ షో నుండి ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బెబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ వరుసగా ఇంటిని వీడారు. శేఖర్ బాషా ఎలిమినేషన్ ఊహించనిది. అతడు హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. 

ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ బాషా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. అయితే శేఖర్ భాషను ఆడియన్స్ ఇంటికి పంపలేదు. హౌస్ మేట్స్ నిర్ణయంతో బయటకు రావాల్సి వచ్చింది. లేదంటే ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యేవాడు. ఇక నాలుగో వారం బిగ్ బాస్ ఇంటి నుండి సొంతింటికి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ మొదలైంది. 

నాలుగో వారం నామినేషన్స్ లిస్ట్

Latest Videos

సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఎప్పటిలానే ప్రతి కంటెస్టెంట్... ఇద్దరు కంటెస్టెంట్స్ ని తగు కారణాలు చెప్పి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేట్ చేసిన కంటెస్టెంట్ ముఖం మీద ఫోర్మ్ స్ప్రే చేయాలి. హాట్ హాట్ గా నామినేషన్స్ సాగాయి. నబిల్ తో పృథ్విరాజ్, సోనియా గొడవపడ్డారు. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

ప్రక్రియ ముగిసిన అనంతరం సోనియా, పృథ్విరాజ్, నబీల్, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, ప్రేరణ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. నైనిక సైతం నామినేట్ అయ్యింది. అయితే ఆమెకు మినహాయింపు దక్కింది. నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. శనివారం ఎపిసోడ్లో నబీల్ సేవ్ అయ్యాడు. ఇక మిగిలింది ఐదుగురు. నాగ మణికంఠ మెజారిటీ కంటెస్టెంట్స్ చేత జీరోగా ముద్ర వేయించుకున్నాడు. ఈ కారణంగా నేరుగా డేంజర్ జోన్లోకి వెళ్ళాడు. 

సోనియా ఎలిమినేషన్ 

నాలుగో వారానికి గాను అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారనేది తాజా సమాచారం. నాగ మణికంఠ టాప్ 2లో ఉన్నాడట. నబీల్ తర్వాత అతడికే అత్యధికంగా ఓట్లు పడ్డాయట. అయితే కంటెస్టెంట్స్ అతడిని జీరోగా నిర్ధారించడంతో డేంజర్ జోన్లోకి వెళ్ళాడు. స్వల్ప ఓట్ల తేడాతో చివరి మూడు స్థానాల్లో సోనియా, పృథ్విరాజ్, ఆదిత్య ఓం ఉన్నారట. 

ప్రేరణ, ఆదిత్య ఓం, పృథ్విరాజ్, నాగ మణికంఠ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారట. చివరికి సోనియా ఆకుల ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారట. 

సోనియా ఎలిమినేషన్ కి కారణాలు 

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కంటే ఆడియన్స్ చాల తెలివిగల వారు. నిజాయితీగా గేమ్ ఆడేవారిని మాత్రమే వారు సపోర్ట్ చేస్తారు. మొదటివారి నుండి పరిశీలిస్తే ... సోనియా గేమ్ లో నిజాయితీ అనేది కరువైంది. ఫేక్ ఎమోషన్స్, ఫేక్ రిలేషన్స్ ఆమె కొనసాగిస్తోంది. అత్యంత సన్నిహితంగా ఉండే నిఖిల్ ని ఉద్దేశించి కూడా ఇతర కంటెస్టెంట్స్ తో తప్పుగా మాట్లాడుతుంది, ఆరోపణలు చేస్తుంది. 

కంటెస్టెంట్స్ ని పర్సనల్ గా టార్గెట్ చేయడం కూడా సోనియాకు మైనస్ అని చెప్పాలి. విష్ణుప్రియపై సోనియా వ్యక్తిగత ఆరోపణలు చేసింది. నీ డ్రెస్సింగ్ అసభ్యకరంగా ఉంటుంది. అడల్ట్ జోక్స్ వేస్తావు, అడల్ట్ కంటెంట్ ఇస్తున్నావు. నీకు ఫ్యామిలీ లేదంటూ ఘాటైన విమర్శలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ ప్రవర్తన, గేమ్ పై విమర్శలు చేయవచ్చు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని ప్రేక్షకులు సహించరు. 

సోనియా యాటిట్యూడ్, బిహేవియర్ సైతం అభ్యంతరకరంగా ఉంటున్నాయి. పృథ్విరాజ్, నిఖిల్ తో ఆమె ప్రవర్తన చాలా అసభ్యంగా తోస్తుంది. మేల్ కంటెస్టెంట్స్ తో సోనియా ఇబ్బందికర ప్రవర్తకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోనియా పై అందుకే విపరీతమైన నెగిటివిటి నడుస్తుంది. 

గ్రూప్ గేమ్ ఆడటం సోనియాకు మరొక మైనస్. పృథ్విరాజ్, నిఖిల్, సోనియా ఒక జట్టుగా ఆడుతున్నారు. అలాగే పృథ్విరాజ్, నిఖిల్ ఆటను సోనియా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నిఖిల్ ఆమె చెప్పిన మాటల ఆధారంగా నిర్ణయాలు మార్చేస్తున్నారు. 

సోనియా పేరెంట్స్ రిక్వెస్ట్ 

సోనియా పేరెంట్స్ ఇటీవల ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మా అమ్మాయి మంచిది అంటూ ఆమెపై ఉన్న నెగిటివిటీ తగ్గించే ప్రయత్నం చేశారు. మా అమ్మాయికి ఎలాంటి ఎఫైర్స్ లేవు. పృథ్విరాజ్, నిఖిల్ లను ఆమె చిన్నోడు, పెద్దోడు అంటుంది. 
వాళ్ళను అన్నయ్యలుగా భావిస్తుంది. సోనియాకు ఆల్రెడీ పెళ్లి కుదిరింది. డిసెంబర్లో వివాహం జరగాల్సి ఉంది. అత్తామామలు, కాబోయే భర్త అనుమతితో బిగ్ బాస్ షోకి వచ్చింది. 

బిగ్ బాస్ షో ఎలా ఉంటుందో మాకు తెలుసు. అక్కడ బిగ్ బాస్ రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి. హౌస్లో సోనియా ప్రవర్తన పట్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇరుగు పొరుగు వారు తప్పుగా భావిస్తున్నారు. దయచేసి మా అమ్మాయిని నెగిటివ్ గా చూపించవద్దు. నిఖిల్, పృథ్విరాజ్ లను సోనియా అన్నయ్యలు అనడం లైవ్ లో చూపించారు. ఎపిసోడ్లో ప్రసారం కాలేదని.. వారు చెప్పుకొచ్చారు. 

సోనియా ఆకుల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సన్నిహితురాలు. ఆయన తెరకెక్కించిన కరోనా చిత్రంలో సోనియా ఆకుల నటించడం విశేషం. 

click me!