టైటిల్ రేసు నుండి నిఖిల్ అవుట్? అంతా ఆమె పుణ్యమే, నాగార్జున హింట్ ఇచ్చేశాడు 

By Sambi Reddy  |  First Published Sep 28, 2024, 8:13 PM IST

ఫస్ట్ వీక్ నుండి టైటిల్ రేసులో ఉన్న నిఖిల్ ర్యాంక్ క్రిందకు జారింది. నాగార్జున కూడా పరోక్షంగా హింట్ ఇచ్చాడు. ఆమె కారణంగానే నిఖిల్ ఇమేజ్ డ్యామేజ్ అయినట్లు తెలుస్తుంది. 
 


బిగ్ బాస్ షోలో రాణించడం అంత సులభం కాదు. ఫిజికల్ టాస్క్ కి మించి, ఇది మెంటల్ ఛాలెంజ్. బిగ్ బాస్ తరచుగా ఎమోషన్స్ తో ఆడుకుంటాడు. తోటి కంటెస్టెంట్స్ సైతం మానసిక దృఢత్వాన్ని పరీక్షిస్తారు. 

గేమ్ లో భాగంగా అనేక స్ట్రాటజీలు ప్లే చేస్తారు.  కంటెస్టెంట్స్ తో రిలేషన్స్ మైంటైన్ చేయాలి. కానీ అవి హద్దుల్లో ఉండాలి. ఒకరిద్దరికి కనెక్ట్ అయ్యి, వారి కోసం మన గేమ్ మార్చుకున్నా, వదిలేసినా దెబ్బ పడుతుంది. నిఖిల్ కి ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఎదురైంది. 

టాప్ కంటెండర్ 

Latest Videos

సీరియల్ నటుడైన నిఖిల్ డే వన్ నుండి హౌస్లో సత్తా చాటుతున్నాడు. ఫిజికల్ టాస్క్ లలో నిఖిల్  ముందుంటాడు. ఆరంభంలోనే చీఫ్ కంటెండర్ అయ్యాడు. బిగ్ బాస్ సైతం నిఖిల్ కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. నిఖిల్ కేంద్రంగా ఆటను నడిపిస్తున్నాడు. 

చెప్పాలంటే నిఖిల్ కి పోటీ ఇచ్చిన కంటెస్టెంట్ మరొకరు లేరు. నిఖిల్ కంటే పాపులారిటీ కలిగిన విష్ణుప్రియ, ఆదిత్య ఓం ఆటలో వెనుకబడ్డారు. నిఖిల్ స్థాయిలో ప్రభావం చూపడం లేదు. ఈ క్రమంలో నిఖిల్ టైటిల్ రేసులో ముందున్నాడు. 

సోనియాతో రిలేషన్ 

సోనియా ఆకుల డే వన్ నుండి స్ట్రాటజిక్ గా గేమ్ ఆడుతుంది. టాప్ కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేస్తూ ఆమె గేమ్ సాగుతుందనే వాదన ఉంది. నిఖిల్ తో సోనియా సన్నిహితంగా ఉంటుంది. పాపులారిటీ పరంగా టాప్ లో ఉన్న విష్ణుప్రియపై సోనియా మాటల దాడి చేసింది. ఆమె ఆత్మ విశ్వాసం దెబ్బ తీసే ప్రయత్నం చేసింది. 

నిఖిల్ తో పాటు సోనియా పృథ్విరాజ్ తో స్నేహం చేస్తుంది. పృథ్విరాజ్, నిఖిల్, సోనియా ఒక టీమ్ గా ఏర్పడ్డాడు. సిస్టర్ అండ్ బ్రదర్స్ రిలేషన్ అని చెప్పుకుంటూ, అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతూ జనాల్లో నెగిటివ్ అవుతున్నారు. నిఖిల్, పృథ్విరాజ్ లతో సోనియా అభ్యంతకర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

నిఖిల్ కి నాగార్జున క్లాస్ 

4వ వారం నిఖిల్ గేమ్ పై ప్రేరణ ఆరోపణలు చేసింది. ప్రేరణ కామెంట్స్ కి నాగార్జున మద్దతు పలికాడు. ప్రేక్షకుల ఫీలింగ్ కూడా అదే అన్నాడు. నా గేమ్ మిస్ బ్యాలన్స్ అయ్యిందని నిఖిల్ హోస్ట్ నాగార్జున ముందు ఒప్పుకున్నాడు. మిస్ బ్యాలన్స్ కావడానికి కారణమైన మిస్ ఎవరని నాగార్జున సెటైర్ వేశాడు. 

నీ గేమ్ గాడి తప్పడానికి సోనియానే కారణమని నాగార్జున పరోక్షంగా నిఖిల్ కి తెలియజేశాడు. సోనియా మాయలో పడి ఆట వదిలేస్తున్నావు. గేమ్ మీద దృష్టి తగ్గిందని నాగార్జున చెప్పకనే చెప్పాడు. నిఖిల్ కి నాగార్జున క్లాస్ పీకడంతో సోనియా ముఖం మాడిపోయింది. 

టైటిల్  రేసు నుండి నిఖిల్ అవుట్ 

నాగార్జున మాటలను బట్టి చూస్తే నిఖిల్ టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. అతడి ర్యాంక్ దిగజారిందని పిస్తుంది. గతంలో అమ్మాయిలతో రిలేషన్స్ కారణం టైటిల్స్ కోల్పోయిన టాప్ కంటెస్టెంట్స్ ఎందరో ఉన్నారు. నిఖిల్ విషయంలో కూడా అదే జరిగే  సూచనలు కనిపిస్తున్నాయి. 

సీజన్ 4లో అఖిల్ సార్థక్, సీజన్ 5 షణ్ముఖ్ జస్వంత్, సీజన్ 6లో శ్రీహాన్ టైటిల్స్ చేజార్చుకున్నారు. మోనాల్ గజ్జర్, సిరి హన్మంత్, శ్రీసత్య వీరి ఓటమికి పరోక్షంగా కారణం అయ్యారు. ఇప్పటికైనా నిఖిల్ మారితే టైటిల్ దక్కుతుంది.

సోనియాకు భారీ షాక్ 

మరోవైపు నాగ మణికంఠ, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నబీల్, ప్రేరణ, పృథ్విరాజ్ నామినేషన్స్ లో ఉన్నారు. సోమవారం మొదలైన ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి ముగిసింది. ఆడియన్స్ తమ అభిమాన కంటెస్టెంట్స్ కి ఓట్లు వేశారు. 

ఓటింగ్లో నబీల్ అగ్రస్థానంలో ఉన్నాడట. నబీల్ కి బుల్లితెర ఆడియన్స్ లో పెద్దగా క్రేజ్ లేదు. అతడు ఓ మోస్తరు సోషల్ మీడియా స్టార్. అయితే తన గేమ్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. నబీల్ గేమ్ పట్ల సంతృప్తిగా ఉన్న ప్రేక్షకులు అతడికి ఓట్లు వేస్తున్నారని అర్థం అవుతుంది 

అనంతరం నాగ మణికంఠ రెండో స్థానంలో ఉన్నాడట. నాగ మణికంఠ ప్రతివారం నామినేషన్స్ లో ఉంటూ సేవ్ అవుతున్నాడు. ఇక మూడో స్థానంలో ప్రేరణ ఉందట. ఓటింగ్ లో సోనియా, పృథ్విరాజ్, ఆదిత్య ఓం వెనుకబడ్డారని తాజా సమాచారం. ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారట. 

సోనియా అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంటుంది. పృథ్విరాజ్, నిఖిల్ తో ఆమె ప్రవర్తన అసభ్యకరంగా ఉంటుంది. అలాగే ఆమె ఇతర కంటెస్టెంట్స్ ని చులకనగా మాట్లాడుతుంది. ఆమె బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ విమర్శలకు దారి తీస్తుంది. సోనియాను ఎలిమినేట్ చేయాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. డేంజర్ జోన్లో ఉన్న ఆదిత్య ఓం సేవ్ అయ్యాడట. పృథ్విరాజ్ సైతం సేఫ్ కాగా,  సోనియా ఎలిమినేట్ కానుందట. ఇది నిఖిల్, పృథ్విరాజ్ లకు భారీ షాక్ అంటున్నారు. 

click me!