ఈ వారం హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ కి భారీ షాక్ ఇవ్వనున్నాడట. ముందస్తు సమాచారం లేకుండా ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయనున్నాడట.
బిగ్ బాస్ తెలుగు 8కి ఇది నాలుగో వారాంతం. అంటే మరో కంటెస్టెంట్స్ ఇంటిని వీడనున్నాడని అర్థం. 11 మంది కంటెస్టెంట్స్ లో ఒకరు ఇంటిని వీడనున్నారు. గత మూడు వారాల్లో బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు.
శేఖర్ బాషాను కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేయడం అనూహ్య పరిణామం. సాధారణంగా తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తారు. రెండో వారం ఆ బాధ్యత నాగార్జున కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు. మెజారిటీ ఇంటి సభ్యులు శేఖర్ బాషాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో ఆదిత్య సేవ్ అయ్యాడు, శేఖర్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. కాగా ఈ వారం ఇంటిని వీడేది ఎవరనే ఉత్కంఠ నెలకొంది.
గత ఆదివారం హోస్ట్ నాగార్జున అభయ్ నవీన్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. తగు కారణాలు చెప్పి ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. నబీల్ తో సోనియా, పృథ్విరాజ్ వాగ్వాదానికి దిగారు.
నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన అనంతరం పృథ్విరాజ్, సోనియా, ప్రేరణ, నబీల్, నాగ మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం లిస్ట్ లో ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు. అయితే నైనికకు మినహాయింపు దక్కింది. దాంతో మిగతా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. సోమవారం మొదలైన ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి ముగిసింది. ఆడియన్స్ తమ అభిమాన కంటెస్టెంట్స్ కి ఓట్లు వేశారు.
స్టార్ మా అధికారిక ఓటింగ్ రివీల్ చేయదు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కి తక్కువ ఓట్లు వచ్చాయని భావించాలి. అయితే ఈ షోకి ఉన్న క్రేజ్ రీత్యా పలు మీడియా సంస్థలు అనధికారిక పోల్స్ నిర్వహిస్తారు. సదరు సర్వేలలో వ్యక్తమైన మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం ఆధారంగా ఎవరు ఎలిమినేట్ అయ్యేది ఒక అంచనాకు రావచ్చు.
4వ వారం ఓటింగ్లో నబీల్ అగ్రస్థానంలో ఉన్నాడట. నబీల్ కి బుల్లితెర ఆడియన్స్ లో పెద్దగా క్రేజ్ లేదు. అతడు ఓ మోస్తరు సోషల్ మీడియా స్టార్. అయితే తన గేమ్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. నబీల్ గేమ్ పట్ల సంతృప్తిగా ఉన్న ప్రేక్షకులు అతడికి ఓట్లు వేస్తున్నారని అర్థం అవుతుంది
అనంతరం నాగ మణికంఠ రెండో స్థానంలో ఉన్నాడట. సింపతీ గేమ్ ఆడుతున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఫేస్ చేసిన నాగ మణికంఠకు కూడా ఆడియన్స్ లో క్రేజ్ పెరుగుతుంది. అది ఓటింగ్ రూపంలో కనబడుతుంది. నాగ మణికంఠ ప్రతివారం నామినేషన్స్ లో ఉంటూ సేవ్ అవుతున్నాడు. ఇక మూడో స్థానంలో ప్రేరణ ఉందట.
ఓటింగ్ లో సోనియా, పృథ్విరాజ్, ఆదిత్య ఓం వెనుకబడ్డారని తాజా సమాచారం. ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారట. ఆదిత్య ఓం గేమ్ పరంగా వెనుకబడ్డాడు. ఆయన హౌస్లో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఆదిత్య ఓం పై నెగిటివిటీ లేదు. అదే సమయంలో పాసిటివిటీ కూడా లేదు.
సోనియా అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంటుంది. పృథ్విరాజ్, నిఖిల్ తో ఆమె ప్రవర్తన అసభ్యకరంగా ఉంటుంది. అలాగే ఆమె ఇతర కంటెస్టెంట్స్ ని చులకనగా మాట్లాడటం, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ విమర్శలకు దారి తీస్తుంది. సోనియాను ఎలిమినేట్ చేయాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. పృథ్విరాజ్ ఫిజికల్ టాస్క్ లలో దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. అతిగా రియాక్ట్ అవుతూ, అగ్రెషన్ చూపిస్తున్నాడు.
హోస్ట్ నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తో కంటెస్టెంట్స్ కి ఊహించని షాక్ ఇవ్వనున్నాడట. డేంజర్ జోన్లో ఉన్న ఆదిత్య ఓం సేవ్ అవుతాడట. మిగిలిన సోనియా, పృథ్విరాజ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటిస్తాడట.
అయితే పృథ్విరాజ్ ఇంటికి వెళతాడట. సోనియాను మాత్రం సీక్రెట్ రూమ్ కి పంపుతారట. హౌస్లో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న సోనియా-పృథ్విరాజ్ ఎలిమినేషన్ వారితో పాటు తోటి కంటెస్టెంట్స్ కి కూడా భారీ షాక్ అంటున్నారు. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
ఇక ఐదవ వారం వైల్డ్ కార్డు ద్వారా మరికొందరు సెలెబ్స్ హౌస్లోకి అడుగుపెట్టనున్నారు. సీజన్ 7లో సైతం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి 5గురు కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపారు. వీరిలో అర్జున్ అంబటి సక్సెస్ అయ్యాడు. ఫైనల్ కి వెళ్ళాడు.
సీజన్ 8లో వైల్డ్ కార్డుతో మాజీ కంటెస్టెంట్స్ వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. హరితేజ, రోహిణి, ముక్కు అవినాష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవారం రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. కొత్తవారు హౌస్లోకి వచ్చాక సోనియా రీ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. కాగా సీజన్ 7 స్థాయిలో సీజన్ 8 కి ఆదరణ దక్కడం లేదు. టీఆర్పీ ఏమంత ఆశాజనకంగా లేదు.