ఐదవ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ ముగిసినట్లు సమాచారం. లిస్ట్ లో ఆరుగురు ఉన్నారట. వీరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూద్దాం..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఐదవ వారంలో అడుగుపెట్టింది. గత నాలుగు వారాల్లో బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా వరుసగా ఎలిమినేట్ అయ్యారు. సోనియా ఎలిమినేషన్ ఊహించినదే. ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఉంది. బ్రదర్స్ అంటూ పృథ్విరాజ్, నిఖిల్ తో ఆమె ప్రవర్తిస్తున్న తీరు ఆడియన్స్ కి నచ్చలేదు.
తోటి కంటెస్టెంట్స్ పై ఆమె వ్యక్తిగత ఆరోపణలు చేయడం కూడా వివాదాస్పదమైంది. గత రెండు వారాలుగా సోనియాను ఎలిమినేట్ చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. నాలుగో వారంసోనియా నామినేషన్స్ లోకి రాగా, ఆడియన్స్ ఇంటికి పంపారు. టైటిల్ ఫేవరెట్ రేసులో ఉన్న నిఖిల్ గేమ్ ని సోనియా దెబ్బ తీస్తుందని ఆడియన్స్ నమ్ముతారు.
undefined
హోస్ట్ నాగార్జున కూడా పరోక్షంగా ఇదే చెప్పాడు. నిఖిల్ ఫ్యాన్స్ సైతం సోనియాకు వ్యతిరేకంగా ఓట్లు వేశారట. ఏదేమైనా కాంట్రవర్సీ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న సోనియా ఆకుల, బిగ్ బాస్ ఇంటిని వీడింది.
సోనియా నిష్క్రమణతో హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. నాగ మణికంఠను మెజారిటీ కంటెస్టెంట్స్ జీరోగా నిర్దారించారు. దాంతో నాగమణికంఠ నేరుగా డేంజర్ జోన్లోకి వెళ్లారు. అయినప్పటికీ అతడు సేవ్ అయ్యాడు. నాగ మణికంఠను నాగార్జున జైలు కి పంపాడు.
సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఎప్పటిలానే తగు కారణాలు చెప్పి ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. నామినేట్ చేసిన సభ్యుల ఫోటోలు మంటల్లో కాల్చాలని ఆదేశించాడు. నామినేషన్స్ వాడివేడిగా సాగాయి.
ఈ వీకెండ్ నిఖిల్ కి నాగార్జున క్లాస్ పీకాడు. పరోక్షంగా సోనియా చెప్పినట్లు ఆడుతున్నావని అన్నాడు. హౌస్ మేట్స్ సైతం ఇదే నిర్ణయం వెలిబుచ్చారు. ఇకపై నా గేమ్ నేను ఆడుతానని నిఖిల్ అన్నాడు. కాగా నిఖిల్ ఈ వారం.. విష్ణుప్రియ, మణికంఠను నామినేట్ చేశాడు.
ఇక ఆదిత్య ఓం.. నైనికను నామినేట్ చేయడం విశేషం. వీరి మధ్య పెద్దగా చర్చ నడవలేదు. గేమ్ లో మనకు పవర్ ఇచ్చినప్పుడు, మన నిర్ణయం మనమే తీసుకోవాలి, అని కారణం చూపుతూ నైనికను ఆదిత్య ఓం నామినేట్ చేశాడు. మరోవైపు ప్రేరణ.. ఆదిత్య ఓం ని నామినేట్ చేయడం విశేషం.
విష్ణుప్రియ... నైనిక, నబీల్ లను నామినేట్ చేసింది. ఫుడ్ విషయంలో విష్ణుప్రియ-నబీల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇకపై అందరూ తిన్నాకే నేను ఫుడ్ తింటాను. మిగిలిందే తింటాను.. అని నబీల్ అన్నాడు. యష్మి.. మణికంఠను నామినేట్ చేసింది. పృథ్విరాజ్ సైతం మణికంఠను నామినేట్ చేశాడు. మెజారిటీ కంటెస్టెంట్స్ నాగ మణికంఠను నామినేట్ చేశారు.
బిగ్ బాస్ తెలుగు 8 నామినేషన్స్ లిస్ట్ తాజా సమాచారం ప్రకారం.. ఐదవ వారం మరో 6 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈ లిస్ట్ లో నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నిఖిల్, నబీల్, నైనిక ఉన్నారు. బిగ్ బాస్ ఈ ఆరుగురు కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నట్లు ప్రకటించినట్లు తెలుస్తుంది.
కాగా మిడ్ వీక్ ఎలిమినేషన్ సైతం ఉంటుందని నాగార్జున చెప్పాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఎప్పుడైనా ఉండొచ్చు. ఒక కొత్త కంటెస్టెంట్ ఇంట్లోకి వస్తే... ఓ కంటెస్టెంట్ ఇంటిని వీడాల్సి ఉంటుందని చెప్పాడు. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అన్నారు. లిస్ట్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.
మణికంఠ, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, నైనికలలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? సమీకరణాలు పరిశీలిస్తే.. నాగ మణికంఠ స్ట్రాంగ్. సింపతీ కావచ్చు, అతని గేమ్ నచ్చడం వలన కావచ్చు... నాగ మణికంఠకు ఓట్లు పడుతున్నాయి. అంటే ఆడియన్స్ తన గేమ్ ఇష్టపడుతున్నారు. దాదాపు ప్రతి వారం నాగ మణికంఠ నామినేషన్స్ లో ఉన్నాడు. కానీ సేఫ్ అయ్యాడు.
నాలుగవ వారం సైతం నబీల్ తర్వాత రెండో స్థానంలో నాగ మణికంఠ ఉన్నాడట. కానీ హౌస్ మేట్స్ అతన్ని జీరో చేయడంతో డేంజర్ జోన్లోకి వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి నాగ మణికంఠ ఎలిమినేట్ కాకపోవచ్చు.
నబీల్ గేమ్ పరంగా ఆకట్టుకుంటున్నాడు. అతడు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువే. విష్ణుప్రియ హౌస్లో ఉన్న సెలెబ్స్ లో టాప్ సెలబ్రిటీ. బుల్లితెర ఆడియన్స్ లో ఫేమ్ ఉంది. కాబట్టి ఆమెకు ఆటోమేటిక్ గా ఓట్లు పడతాయి. నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్. అలాగే సీరియల్ నటుడు. కాబట్టి ఆయన ఎలిమినేట్ కావడం జరగదు.
మిగిలిన నైనిక, ఆదిత్య ఓం, వీక్ అని చెప్పొచ్చు. ఆదిత్య ఓం ఒకప్పటి టాలీవుడ్ హీరో. ప్రస్తుతం ఆయనకు పెద్దగా ఫేమ్ లేదు. హౌస్లో ఆయన గేమ్ కూడా ఏమంత ఆసక్తికరంగా లేదు. ఆదిత్య చాలా సాఫ్ట్ గా ఉంటారు. ఆయన కంటెంట్ ఇవ్వడం లేదు. కాబట్టి ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.
నైనిక సైతం వీక్ కంటెస్టెంట్. హౌస్లో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకోలేకపోయింది. నైనిక నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.