స్టార్ట్ అయిన ఫినాలే రేస్, నన్ను పంపించేయండి... ఆడియన్స్ ను వేడుకున్న శివాజీ

By Mahesh JujjuriFirst Published Nov 28, 2023, 11:00 PM IST
Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య హోరా హోరీ పోరుతో పాటు..ఓ యుద్ద వాతావరణ నెలకొంది. మూములుగా అంతా బాగానే ఉన్నా.. టాస్క్ లు, నామినేషన్ల సంరద్భంలో హోరా హోరీ తలపడుతున్నారు కంటెస్టెంట్స్. 
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగింపు దశకు వచ్చింది. ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుంటే.. హౌస్ లో ఉన్నవారిపై ప్రెజర్ పెరిగిపోతోంది. టెన్షన్ తో చిర్రెత్తిపోతున్నారు కంటెస్టెంట్స్. ఇక ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. టాప్5 లోకి వెళ్లడానికి టికెట్ టు ఫినాలే రేస్ ను స్టార్ట్ చేశారు బిగ్ బాస్. కొత్త టాస్క్ లతో కఠినమైన పరీక్షలు పెట్టబోతున్నాడు. ఈక్రమంలో హౌస్ లో మరోసారి  యుద్ద వాతావరణం అలముకుంది. ఈక్రమంలో ముందు రోజు జరిగిన నామినేషన్ల పై కూడా ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి.. మాట్లాడుకున్నారు. ఈసందర్భంగా అమర్ ప్రవర్తనకు  విసిగిపోయిన శివాజీ.. తాను తొందరగా బయటకు వెళ్తే బాగుండు అనుకున్నాడు. అంతే కాదు తనను బయటకు పంపించేయాలని ఆడియన్స్ కు రిక్వెస్ట్ కూడా చేసుకున్నాడు శివాజీ. 

అటు టికెట్ టూ ఫినాలేకు రంగం సిద్దం అయ్యింది. హౌస్ లో ఉన్న 8 మందిలో టాప్ 5 లోకి వెళ్లి.. కప్పు గెలిచేందుకు పోటీపడే వారిలో మొదటి వ్యక్తి కోసం టాస్క్ లు స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. అందుకోసం ఈరోజు రెండు టాస్క్ లు పెట్టాడు. ఈ టాస్క్ లలో గెలవాలి అనుకున్న శివాజీ, శోభ, ప్రియాంక ఆశలు గల్లంతయ్యాయి. టాప్ లో ఉన్న ఈ ముగ్గరు రెండుటాస్క్ లలో మొదటి రౌండ్ లోనే ఫెయిల్ అయ్యారు. అయితే ఈ టాస్క్ లో అమర్ గెలవడంతో.. శివాజీ, శోభ పాయింట్స్ కూడా అమర్ కు ఇవ్వాల్సి వస్తుంది. దాంతో అమర్ టాప్ లోకి వెళ్లిపోయాడు. దాంతో శోభ గేమ్ నుంచి ఎగ్జిట్ అయినందకు ఏడుస్తుంటుంది. ప్రియాంక, ప్రశాంత్ ఆమెను ఓదార్చుతారు. 

Latest Videos

ఇక టాస్క్ ల గురించి హౌస్ లో అర్ధరాత్రి వరకూ డిస్కర్షన్స్ జరుగుతుంటాయి. అంతే కాదు అర్ధ రాత్రి కూడా ఫినాలే రేస్ కు సబంధించి టాస్క్ లు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ టాస్క్ లో పాల్గొన్న అందరూఓడిపోగా.. అమర్, ప్రియాంక మధ్య పోటీ జరుగుతుంది. ఈ గేమ్ లో ఇద్దరు బాల్ కోసం పెనుగులాట చేసుకుంటారు. ప్రియాంక బ్రతిమలాడుతున్నా వినకుండా అమర్ బాల్ ను లాక్కునే ప్రయత్నం చేస్తాడు. ఈక్రమంలో ప్రియాంక ఎంత బ్రతిమలాడినా వినడు. అంతే కాదు అమర్ చేతిని కొరుకుతుంది ప్రియాంక. 

చివరకు ప్రియాంక నుంచి బాల్ ను లాక్కొని అమర్ తన టార్గెట్ ను ఫినిష్ చేస్తాడు. ఈ విషయంలో బాధపడుతుంటుంది ప్రియాంక. ఏంత కష్టపడ్డా ఫలితం లేనందున ఏడుస్తుంది. ఇక ఈ టాస్క్ అర్జున్ ఎక్కువ పాయింట్స్ సాధిస్తాడు. ఇక ప్రియాంకను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు అమర్. బిగ్ బాస్ సీజన్ 7 మరో మూడు వారాల్లో ముగియనుంది. టాప్ 10 నుండి అశ్విని, రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యారు. హౌస్లో శివాజీ, ప్రశాంత్, అమర్, శోభ, ప్రియాంక, అర్జున్, యావర్, గౌతమ్ మాత్రమే మిగిలారు. వీరిలో 7 గురు నామినేషన్స్ లో ఉన్నారు. అమర్ మినహాయించి అందరు నామినేట్ అయ్యారు. 

 
 

click me!