Guppedantha Manasu Serial Today:వసు, చిత్రలను సేవ్ చేసిన రిషి, దేవయానికి ముచ్చెమటలు పట్టించాడుగా..!

Published : Nov 28, 2023, 08:14 AM ISTUpdated : Nov 28, 2023, 09:21 AM IST
Guppedantha Manasu Serial Today:వసు, చిత్రలను సేవ్ చేసిన రిషి, దేవయానికి ముచ్చెమటలు పట్టించాడుగా..!

సారాంశం

రిషి తన దగ్గర చిత్ర చెప్పింది నిజం అనే సాక్ష్యం ఉందని చూపించనా అంటాడు. ఆ తర్వాత వెంటనే కారులో నుంచి మూలుగులు వినిపిస్తాయి. ఆ వాసవ్ ని రిషి కట్టేసి కారులో పడేస్తాడు. వాడినే తీసుకొని వస్తాడు.  

Guppedantha Manasu Serial Today: నిన్నటి ఎపిసోడ్ లో రౌడీలు చిత్రను చంపడానికి వస్తే, ఆ ప్లాన్ ని  రిషి తిప్పికొట్టిన విషయం తెలిసిందే. చిత్రను వాళ్ల బారి నుంచి క్షేమంగా కాపాడతాడు. ఆ తర్వాతరోజు చిత్ర తల్లిదండ్రులు, పోలీసులు చిత్ర కనపడటం లేదని కారణం రిషి, వసులే అని నిందలు వేస్తుంటే, ఆమెను అందరికీ చూపిస్తాడు. మహేంద్ర చాలా జాగ్రత్తగా వీల్ చైర్ లో చిత్రను కూర్చోపెట్టుకొని తీసుకువస్తాడు. అది చూసి చిత్ర పేరెంట్స్ తో పాటు, వీడియో కాల్ లో చూస్తున్న దేవయాణికి కూడా ఫ్యూజులు ఎగిరిపోతాయి. రాక్షసుల నుంచి కాపాడి తీసుకురావడానికి సమయం పట్టింది అని మహేంద్ర చెబుతాడు. ఆ తర్వాత చిత్రను నిజం బయటపెట్టమని మహేంద్ర చెబుతాడు. పోలీసులు కూడా చిత్రకు ధైర్యం చెప్పి, ఇక్కడ నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా నిజం చెప్పమని అంటాడు. నువ్వు ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి వసుధార మేడమ్ కారణమా అని పోలీసులు అడుగుతారు.

అప్పుడు చిత్ర, అలా అని ఎవరు చెప్పారు మీకు అని అడుగుతుంది. నువ్వు సూసైడ్ లెటర్ కూడా రాశావు కదా అంటే, తాను ఏ సూసైడ్ లెటర్ రాయలేదని చెబుతుంది. ఆ పేపర్ చూపించిన తర్వాత కూడా తాను అసలు ఈ ఉత్తరం రాయలేదని, సంతకం మాత్రమే తనదని, ఉత్తరం రాసింది మాత్రం తాను కాదని చెబుతుంది. అంతేకాదు అసలు తాను సూసైడ్ అంటెప్ట్ కూడా చేయలేదని చెబుతుంది. ఆ మాట విని అందరూ షాకౌతారు. వెంటనే వాళ్ల అమ్మ చిత్రను మానిప్యూలేట్ చేయాలని చూస్తుంది. ‘ నవ్వు, వాసవ్ ప్రేమించుకుంటుంటే, ఈ మేడమ్ వచ్చి  మిమ్మల్ని బెదిరించింది కదా? వాసవ్ లేకపోతే బతకలేవనే కదా నువ్వు ఆత్మహత్యకు ప్రయత్నించావ్’ అని చిత్ర వాళ్ల అమ్మ అంటుంది.

కానీ, చిత్ర మాత్రం ఏ మాత్రం తొణకకుండా నిజం చెప్పేస్తుంది. ‘ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు? నేను అసలు వాసవ్ ని ప్రేమించనేలేదు. ఈ విషయం మీకు కూడా తెలుసుకదా’ అని వాళ్ల అమ్మతో అంటుంది. అయితే, చిత్ర పేరెంట్స్ చెప్పిన దానికీ, చిత్ర చెబుతున్నదానికి పొంతనలేకపోవడంతో, పోలీసులకు కూడా అయోమయానికి గురౌతారు. అసలు ఏం జరుగుతోందని ప్రశ్నిస్తాడు. సీసీటీవీ వీడియో చూపించి ఇది నిజం కాదా అని ప్రశ్నిస్తాడు. వసుధార మేడమ్ వార్నింగ్ ఇస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది కదా అని పోలీసు ఆఫీసర్ అడగగా, వసు మేడమ్ తనను కలిసింది కానీ, వార్నింగ్ ఇవ్వలేదు అని చెబుతుంది. అయితే, ఇలా సగం సగం కాదని, పూర్తిగా ఏం జరిగిందో చెప్పమని పోలీసు అధికారి అడుగుతాడు.

‘వాసవ్ నన్ను ప్రేమించమని రోజూ నన్ను వేధించేవాడు. రీసెంట్ గా కాలేజీకి కూడా వచ్చాడు. అప్పుడే రిషి సర్, వసుధార మేడమ్ వాసవ్ కి వార్నింగ్ ఇచ్చి నాకు ధైర్యం చెప్పారు. వీళ్లు నన్ను బలవంతపెట్టి, ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు.  ఆ తర్వాత నాకు తెలీకుండానే వసుధార మేడమ్ కి నా మొబైల్ నుంచి మెసేజ్ చేశారు. నేను ప్రాబ్లంలో ఉన్నాను అనుకొని మేడమ్ ఇంటికి వచ్చారు. నేను మేడమ్ తో మాట్లాడుతుంటే, వాసవ్ వచ్చి మళ్లీ నన్ను ఇబ్బంది పెట్టాడు. అప్పుడు మేడమ్ అందరితో మాట్లాడి సర్దిచెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఉన్నట్లుండి నా నోట్లో నుంచి నురగలు వచ్చాయి. కళ్లు తిరిగిపోయాయి అంతే సర్. మేడమ్ నన్ను బెదిరించలేదు. నేను సూసైడ్ అంటెప్ట్ చేసుకోలేదు ’ అని చిత్ర అసలు నిజం బయటపెడుతుంది.

అయితే, వాళ్ల అమ్మ చిత్ర అబద్ధం చెబుతుంది అంటుంది. పోలీసులు భయపడకమ్మా, వాళ్లు నీ తల్లిదండ్రులమ్మ, వాళ్లు ఎందుకు అబద్దం చెబుతారు అని పోలీుసలు అడుగుతారు. అయితే, అసలు వాళ్లు తన పేరెంట్స్ కాదని చెప్పి షాకిస్తుంది. వాళ్లు.. తన బాబాయ్ , పిన్ని అని, తన పేరెంట్స్ చనిపోతే, వీళ్ల దగ్గర ఉంటున్నాని చెబుతుంది. చిన్నప్పటి నుంచి తనను చాలా ఇబ్బందిలు పెడుతున్నా తాను భరిస్తూ వచ్చానని, కానీ ఈసారి ఏకంగా తన ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారని చెబుతుంది. దీంతో, వాళ్ల అమ్మకాని అమ్మ.. ఎమోషనల్ డ్రామా మొదలుపెడుతుంది. నా కూతురిని వీళ్లు బెదిరించి, భయపెట్టారు అందుకే ఇలా అబద్ధాలు చెబుతోంది అని అంటుంది.

వెంటనే రిషి రియాక్ట్ అవుతాడు. చిత్ర మా దగ్గర ఉంది కాబట్టి, మేం బెదిరించామని తాను అబద్ధం చెబుతోందని అంటున్నారు. చిత్ర తాను చెప్పేదే నిజం అంటోంది.. మరి నిజం ఎలా బయటపడుతుంది? అని రిషి ప్రశ్నిస్తాడు. పోలీసులు కూడా చిత్ర చెప్పింది అబద్ధం అనిపిస్తోందని, తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటాడు. అయితే, రిషి తన దగ్గర చిత్ర చెప్పింది నిజం అనే సాక్ష్యం ఉందని చూపించనా అంటాడు. ఆ తర్వాత వెంటనే కారులో నుంచి మూలుగులు వినిపిస్తాయి. ఆ వాసవ్ ని రిషి కట్టేసి కారులో పడేస్తాడు. వాడినే తీసుకొని వస్తాడు.

వాసవ్ ని తీసుకొని రావడంతో అందరూ షాకౌతారు. ఆ తర్వాత రిషి, చిత్రను ఎందుకు చంపాలని అనుకున్నావ్ అని వాసవ్ ని రిషి ప్రశ్నిస్తాడు. వాసవ్ దొరికిపోతే తమకు ప్రాబ్లం అవుతుందని దేవయాణి శైలేంద్రకు ఫోన్ చేయబోతాడు. అయితే, శైలేంద్ర ఫోన్ కలవదు. ఈ లోగా వాసవ్ అసలు నిజం చెప్పేస్తాడు. తాను చిత్రను చంపాలని అనుకున్నానని అంగీకరిస్తాడు. ఇక్కడ కూడా  రిషి, వాసవ్ ని బెదిరించాడని చిత్ర పిన్ని ఆరోపిస్తుంది. అప్పుడు రిషి సాక్ష్యం చూపిస్తాడు.

వెంటనే పోలీసులు వాసవ్ ని కొట్టి, ప్రేమంటే ఇదేనా, తన ప్రాణాలు ఎందుకు తీయాలని అనుకున్నావ్ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. అయితే, వాసవ్ వెనక ఎవరో ఉన్నారు అని రిషి అంటాడు. ఒక వ్యక్తి వచ్చి డబ్బులు ఇస్తామని, వసుధారను ఇరికిస్తే చాలు అని చెప్పి వెళ్లిపోయాడని, కొంత డబ్బు అడ్వాన్స్ గా కూడా ఇచ్చాడని చెబుతాడు. అతని పేరు ఏంటి అని బెదిరించగా, వాసవ్ తనకు తెలియదు అని చెప్పేస్తాడు. డబ్బు కోసం మాత్రమే అంగీకరించామని చేయించిన వ్యక్తి పేరు మాత్రం తనకు తెలీదని వాసవ్ అంటాడు. తర్వాత రిషి బెదిరించడంతో ఎంఎస్ఆర్ అతని పేరు అని వాసవ్ చెప్పేస్తాడు. శైలేంద్ర పేరు చెప్పకపోవడంతో దేవయాణి ఊపిరి పీల్చుకుంటుంది.

నిజానిజాలు ఇప్పుడు మీకు తెలిశాయా ? వసుధార ఏ తప్పు చేయదని ముందుగానే మీకు చెప్పినా  మీరు నమ్మలేదు అని రిషి, పోలీసులతో అంటాడు. ఒక కేసులో ఒకే కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోకండి, రెండు వైపులా ఆలోచించాలి అప్పుడు నిజాలు బయటపడతాయి, న్యాయం జరుగుతుందని, వేరే కేసుల్లో ఇలా చేయకండి అని పోలీసులకు చెబుతాడు. అతను సారీ చెప్పి, నిందితులను అరెస్టు చేసి తీసుకొని వెళతాడు.

ఆ తర్వాత చిత్ర ఏడుస్తుంటే, రిషి, వసు, మహేంద్ర ఓదారుస్తారు. ఇప్పటి నుంచి నీ భవిష్యత్తు మొత్తం డీబీఎస్టీ కాలేజీ చూసుకుంటుందని, మిషిన్ ఎడ్యుకేషన్ ద్వారా సహాయం చేస్తామని వసు, రిషిలు  ధైర్యం ఇస్తారు. దీంతో, చిత్ర సంతోషిస్తుంది. మరోవైపు దేవయాణి శైలేంద్రకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది.  శైలేంద్ర, ధరనితో రొమాంటిక్ గా ఉండటంతో ఫోన్ తీయడు. ఫోన్ తీయడం లేదని మరోవైపు దేవయాణి ఫ్రస్టేట్ అవుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?