Brahma Mudi Serial Today:కళ్యాణ్ లోనూ అప్పూ పై ప్రేమ? వీరి పెళ్లికి కనకం ప్రయత్నాలు, అరుణ్ కోసం కావ్య వేట

By telugu news teamFirst Published Nov 28, 2023, 10:34 AM IST
Highlights

కనకం మాత్రం ఇద్దరు కూతుళ్లను పంపించానని, అప్పూని కూడా పంపించలేనా అని అమాయకంగా అడుగుతుంది. అప్పూ తన ప్రేమను మనసులో దాచుకున్నట్లు, కళ్యాణ్ కూడా తన ప్రేమను అలా మనసులోనే దాచుకున్నాడేమో అనే సందేహం వ్యక్తం చేస్తుంది. 


Brahma Mudi Serial Today: అప్పూ పడుతున్న బాధ చూసి కనకం చలించిపోతుంది. కళ్యాణ్ తో అప్పూకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని తన అక్కతో అంటుంది. ఆమె కనకాన్ని తిట్టేస్తుంది. ఈ విషయం మీ ఆయనకు తెలిస్తే చంపేస్తాడని, ఇంట్లో నుంచి గెంటేస్తాడు అని హెచ్చరిస్తుంది. ఈ విషయం ఇక్కడితో వదిలేయమని, మన మధ్యే ఉండనివ్వమని చెబుతుంది. కానీ, కనకం అంగీకరించదు. అప్పూ బాధ తగ్గడం లేదని కనకం చెబుతుంది. అయితే, అప్పుడు అప్పూ పెద్దమ్మ మాట్లాడుతుంది. మొదటి నుంచి అప్పూ కళ్యాణ్ ని ప్రేమిస్తుందనే విషయం ఆమెకు మాత్రమే తెలుసు. ముందు గుర్తించింది కూడా ఆమెనే. అందుకే, కళ్యాణ్ కి పెళ్లి కుదిరిన విషయం తెలిసిన తర్వాతే అప్పూకి తన ప్రేమ విషయం తెలిసిందని చెబుతుంది. కానీ, కళ్యాణ్ కి, అప్పూతో పెళ్లి జరిగితే సమస్యలు మరింత ఎక్కువ అవుతాయని, ఇప్పటికే మన కుటుంబం మోస్తున్న నిందలు చాలు అని కనకానికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది.

Latest Videos

కానీ, కనకం మాత్రం తాను ఎవరి గొంతు కోయడం లేదని, కేవలం అప్పూ ఆశపడుతోందని మాత్రమే అని సాగదీస్తుంటే, వాళ్ల అక్క అంగీకరించదు. మళ్లీ మొదటికి వస్తున్నావని, స్వప్న పెళ్లి చేయడానికి కూడా చాలా అబద్ధాలు ఆడావని, ఫలితంగా కావ్యను ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చిందని,ఆ సమయంలో చాలా నిందలు పడ్డామని, ఇప్పటికీ నిందలు పడుతూనే ఉన్నామని  గుర్తు చేస్తుంది. నీ కారణంగానే కావ్య ఇప్పటికీ ఇబ్బందులు పడుతుందని, ఆ ఆాలోచనలు ఆపేయమని చెబుతుంది. కనకం మాత్రం ఇద్దరు కూతుళ్లను పంపించానని, అప్పూని కూడా పంపించలేనా అని అమాయకంగా అడుగుతుంది. అప్పూ తన ప్రేమను మనసులో దాచుకున్నట్లు, కళ్యాణ్ కూడా తన ప్రేమను అలా మనసులోనే దాచుకున్నాడేమో అనే సందేహం వ్యక్తం చేస్తుంది. 

‘అనామిక ప్రేమిస్తుందని చెబితే అంగీకరించాడేమో, ముందే అప్పూ తన ప్రేమ విషయం చెప్పి ఉంటే, కళ్యాణ్ అంగీకరించేవాడేమో? కళ్యాణ్ కి కూడా అప్పూ అంటే చాలా ఇష్టం. నేను అనుకున్నదే నిజమైతే, పెళ్లికి ముందే కళ్యాణ్ ని ఒప్పిస్తే అప్పూ కూడా...’ అని కనకం అనగానే, సరిగ్గా ఆ సమయానికి మూర్తి వస్తాడు. కనకం మీద సీరియస్ అవుతాడు. అప్పూని కూడా అదే ఇంటికి పంపుతావా? మళ్లీ అబద్ధాలు, మోసాలు మొదలుపెడతావా అని తిడతాడు. అది కాదు అని కనకం ఏదో చెప్పబోతుంటే.. నోర్ముయ్ అని తిట్టేస్తాడు. ఇప్పటికే ఆ ఇంట్లో మనల్ని పురుగుల్లా చూసేస్తున్నారని, ఈ విషయం తెలిస్తే, అక్కడున్న ఇద్దరినీ కూడా కొట్టి పుట్టింటికి పంపేస్తారని, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తాడు. ఇంకోసారి ఏది చేసినా తనకు చెప్పాల్సిందేనని, నీ సొంత ఆలోచలనతో ఏ పనులు చేయవద్దు అని, తనకు తెలీకుండా ఏం చేసినా ఇంట్లో నుంచి గెంటేస్తాను అని సీరియస్ వార్నింగ్ ఇస్తాడు.

మరోవైపు ఇంట్లో జరిగిన దాని గురించి స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కావ్య ఎంట్రీ ఇస్తుంది. ఎన్నిసార్లు తిక్క పనులు చేస్తావ్ అక్క అని కావ్య అంటే, అసలే చిరాకులో ఉన్నాను అంటుంది స్వప్న. చిరాకు నీకు ఎందుకు మాకు కదా రావాల్సింది అని కావ్య అంటే,  సమస్య నాది, నీది కాదు అని స్వప్న బదులిస్తుంది.

‘నీ సమస్య నాది కూడా అని ఇంకెప్పడు అర్థం చేసుకుంటావ్ అక్క? నీకు ఏ సమస్య తెచ్చినా అది నా మెడకు కూడా చుట్టుకుంటుందని, నీతో కలిపి నన్ను కూడా కలిపేస్తారు’ అని కావ్య అంటుంది. ‘అయితే, అందరినీ పిలిచి, మా చెల్లి ఏ తప్పు చేయలేదు అని బతిమిలాడమంటావా?’ అంటుంది స్వప్న. అప్పుడు కావ్య, అసలు విషయంలోకి వెళ్తుంది. స్వప్న ఎంత పెద్ద సమస్యలో చిక్కుకుందో అర్థమయ్యేలా ప్రయత్నం చేస్తుంది. ‘తల్లి కావడం ఎవరికైనా అదృష్టాన్ని ఇస్తుంది, ఆ విషయం తెలియగానే చాలా సంతోషిస్తుంది, తన చుట్టూ ఉన్నవారు, భర్త తో కూడా గర్వంగా చెప్పుకుంటారు. పండగలా సెలబ్రేట్ చేసుకంుటారు. కానీ, నీ విషయంలో వార్త వినగానే అందరూ అయోమయంలో పడ్డారు. ఏం చేయాలో అర్థంకాక, నీ విషయంలో  ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక అయోమయంలో పడిపోతున్నారు’ అని కావ్య చెప్తుంది. అప్పుడు స్వప్న‘ ఎవరు ఏమనుకున్నా,నేను ఏ తప్పు చేయలేదు’ అని చెప్తుంది. అయితే, అరుణ్ కి డబ్బులు ఎందుకు ఇచ్చావ్ అని అడుగుతుంది.  నిన్ననే చెప్పాను కదా? అని స్వప్న అంటే, ‘నువ్వు చెప్పిందే నాకే నమ్మేలా అనిపించలేదు, ఇంట్లోవాళ్లు ఏం నమ్ముతారు? అయినా నీకు ముందే చెప్పాను కదా? ఆ అరుణ్ విషయంలో ఏం జరిగినా నాకు చెప్పమని ముందే చెప్పాను కదా? చెప్పకుండా డబ్బులు ఎందుకు ఇచ్చావ్?’ అని అడుగుతుంది.

డబ్బులు ఇస్తే ఇక నా జీవితంలో రాడు అన్నాడని ఇచ్చాను అని స్వప్న అమాయకంగా బదులిస్తుంది. డబ్బులు ఇస్తే, నువ్వు దోషివి అవుతావ్ కదా, ఆ లాజిక్ ఎలా మర్చిపోయావ్ అని కావ్య బదులిస్తుంది. ‘ నేను ఏమైనా కలగన్నానా వాడు ఎలా  అలా చేస్తాడని? నీకు అరుణ్ ముందు నుంచి తెలుసుకదా వాడు ఎలాంటివాడో? వాళ్ల ఇంట్లో ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ నాకు ఇష్టంలేదు అని చెప్పగానే, నా బాధను అర్థం చేసుకొని పెళ్లి క్యాన్సిల చేశాడు. రాహుల్ పెళ్లి ఆపడానికి ఫేక్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్  కూడా ఇఛ్చాడు. అంతలా హెల్ప్ చేసినవాడు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తాడని ఎందుకు అనుకుంటా? ఒకవేళ డబ్బులు కోసం చేసినా, ఆ విషయం బయటపెడతాను అనాలి కానీ, ఇప్పుడు కాదు కదా? నా స్థానంలో నువ్వు ఉన్నా ఇలానే చేసేదానివి’ అని స్వప్న చెబుతుంది.

దీంతో, కావ్య ఆలోచనలో పడుతుంది. ‘నిజంగానే అరుణ్ అలా ఎలా మారాడు? నిజంగా అతనే మారాడా? తన వెనక ఎవరైనా ఉన్నారా?’ అంటుంది. స్వప్న ఆ విషయం తనకు ఎలా తెలుస్తుందని చెబుతుంది. అయితే, ఆ విషయం తాను తెలుసుకుంటాను అని కావ్య చెబుతుంది. అయితే, అప్పటి వరకు ఏ పిచ్చి పని చేయకు అని సలహా ఇస్తుంది. అదేవిధంగా ఈ గొడవలో పడి ఆరోగ్యాన్ని పక్కన పెట్టవద్దని, బిడ్డ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. తర్వాత  ఈ విషయం అమ్మకు చెప్పావా అని అడుగుతుంది. ఈ గొడవల గురించి చెప్పాల్సి వస్తుందని చెప్పలేదని అంటుంది. కావ్య నేను చెబుతాను అంటే, స్వప్న నేనే చెప్పుకుంటానులే అంటుంది. గొడవల విషయం మాత్రం చెప్పకు అని సలహా ఇచ్చి, ఏం తినాలని ఉన్నా తనకే చెప్పమని చెబుతుంది.

కావ్య ఆలోచించుకుంటూ బయటకు వస్తుంది. అరుణ్ డబ్బు కోసం ఇలా చేశాడని అనిపించడంలేదని, స్వప్నను ఇరికించడానికే అలా చేశాడని అనిపిస్తోంది అని అనుకుంటుంది. అప్పుడే సరిగ్గా రాహుల్, రుద్రాణి మాట్లాడుకుంటూ కనిపిస్తారు. దీంతో వాళ్ల దగ్గరకు కావ్య వెళ్తుంది. రాహుల్ మీద కౌంటర్లు వేస్తుంది. దీంతో, రుద్రాణి స్వప్న మీద కౌంటర్లు వేస్తుంది. దీంతో, కావ్య తన అనుమానాన్ని వాళ్ల ముందు పెడుతుంది. అరుణ్ కి మా అక్క డబ్బులు ఇచ్చిన విషయం మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. ఫోటోలు చూపించాం కదా అని రుద్రాణి అంటే.. ఆ ఫోటోలు మీకు ఎలా వచ్చాయి అని అడుగుతుంది. ఆ ఫోటోలు మీకే ఎందుకు పంపించారు? మీకే ఎందుకు పంపారు? ఎవరు పంపారు అని అడుగుతుంది.

ఎవరు పంపించారో తమకు తెలీదని రాహుల్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ, కావ్య వదలదు. దీంతో, రాహుల్ ఆ ఫోటోలు పంపినవాడి నెంబర్ నీకు పంపుతా నువ్వే వెతుక్కో అంటాడు. దీంతో కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎందుకు ఫోన్ నెంబర్ ఇచ్చావ్ అని రుద్రాణి అడిగితే, అరుణ్ నెంబర్ కావ్య దగ్గర కూడా ఉండే ఉంటుందని అని చెబుతాడు. దీంతో, వాళ్లిద్దరూ కావ్యకు అనుమానం వచ్చిందని, వెళ్లి అరుణ్ ని కలిసేలోపు వాడిని ఎక్కడైనా హైడ్ అవ్వమని చెప్పమని రుద్రాణి సలహా ఇస్తుంది. రాహుల్ సరే అంటాడు. కావ్య వెళ్లి ఫోన్ చెక్ చేసుకుంటే, అరుణ్ నెంబర్ ఉంటుంది. అరుణ్ ని పట్టుకుంటే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి అని డిసైడ్ అవుతుంది.

మరోవైపు కళ్యాణ్, అనామికతో కలిసి కారులో బయటకు వెళుతూ ఉంటాడు. షాపింగ్ కి అప్పూ కూడా ఉండాలని కళ్యాణ్ అంటాడు. అయితే, అనామిక తనకు అన్నీ తెలుసు అని అప్పూ అవసరం లేదని చెబుతుంది. కానీ కళ్యాణ్ మాత్రం అప్పూ ఉండాల్సిందే అని,  అప్పూకి షాప్స్ తో పాటు, అక్కడి మనుషులు కూడ తెలుసు అని అంటాడు. అయితే అనామిక అంటే, నాకు ఏమీ తెలీదంటావా అని అంటుంది. కళ్యాణ్ అలా కాదని, మన ముఖాలు చూస్తే రూ.100 వస్తువు కూడా రూ.వెయ్యి చెబుతారని, అప్పూ ఉంటే ఆ చీటింగ్ జరగందటాడు. దానికి అనామిక మనం రిచ్ గా కనపడతాం, అప్పూ కనిపించదనా అంటుంది. అది కాదని, మనల్ని చూస్తే అమాయకులని మోసం చేస్తారు.. అప్పూని చూస్తే అలా మోసం చేయరని, భయపడైనా నిజం చెప్పేస్తారని అంటాడు. ఆ మాటలకు అనామిక అలిగినట్లుగా ముఖం పెడుతుంది. అప్పూనే నీకు గొప్ప కదా అని సీరియస్ గా అనామిక అంటే, అప్పూ వల్లే తన జీవితంలోకి  నువ్వు వచ్చావ్ అంటాడు. ఆ మాటతో మళ్లీ అనామిక కరిగిపోతుంది.

కళ్యాణ్ వాళ్లు అప్పూ ఇంటికి వెళతారు.  అనామికను కారులో ఉంచి, అప్పూని తీసుకువస్తాను అని కళ్యాణ్ వెళతాడు. వెళ్లి అప్పూ ఎక్కడ ఉందని కనకం ని అడుగుతాడు.  అప్పూ సరిగా ఉండటం లేదు అనే విషయం కళ్యాణ్ కి చెబుతుంది. అప్పూ బాధ తెలుసుకోమని సలహా ఇస్తుంది. కళ్యాణ్ వెళ్లి, అప్పూని ఎందుకు ఇంత డల్ గా ఉన్నావ్ అని అడుగుతాడు. కళ్యాణ్ అడిగిన ఏ ప్రశ్నకు అప్పూ సరిగా సమాధానం ఇవ్వదు. తిక్క తిక్క గా మాట్లాడుతుంది. బయటకు వెళదాం రా అని తీసుకొని వెళతాడు. నువ్వు బాధపడితే నేను చూడలేమని, నేను నీ ఫ్రెండ్ కదా అని కళ్యాణ్ అంటాడు. ఇంట్లోనే ఉంటే డిప్రెషన్ కి వెళతావని, బయటకు వెళదాం అంటాడు. చార్మినార్ షాపింగ్ కి వెళదామని అనామిక కూడా ఉందని అంటాడు. అయితే, అనామిక కూడా ఉంది అనడంతో అప్పూ కి కాలుతుంది. నేను రాను అని చెప్పేస్తుంది. కళ్యాణ్ మాత్రం వదలకుండా పక్కన కూర్చొని మాట్లాడతాడు. నీ పరిచయానికి ముందు నేను కూడా డల్ గా ఉండేవాడినని, నువ్వు వచ్చాకే నా ప్రపంచం మారింది అని చెబుతాడు. నిజమైన ఆనందాన్ని తనకు పరిచయం చేసింది కూడా నవ్వే అని అప్పూతో చెబుతాడు. అలాంటిది నువ్వు ఇలా ఉంటే, నిన్ను వదిలి నేను ఎలా వెళతాను అంటాడు. అప్పూ ని పట్టుకొని బతిమాలుతూ ఉంటాడు.

ఈ లోగా, కారులో కూర్చొని విసిగిపోయిన అనామిక చిరాకుగా ఇంట్లోకి వస్తుంది. రావడం రావడమే సీరియస్ అవుతుంది. నన్ను రోడ్డు మీద వదిలేసి నువ్వు నీ ఫ్రెండ్ తో ముచ్చట్లు పెడుతున్నావని, నీ ఫ్రెండ్ ఫీలింగ్స్ అర్థమౌతాయి కానీ, నా ఫీలింగ్స్ అర్థం కావా అని సీరియస్ అవుతుంది. తనను వెయిట్ చేయించడంపై మండిపడుతుంది.

కమింగ్ అప్ లో రాహుల్ వెళ్లి, అరుణ్ తో మాట్లాడతాడు. కావ్య నిన్ను వెతుక్కుంటూ వస్తుందని చెబుతాడు. సరిగ్గా ఆ సమయంలోనే  రాజ్, కావ్య అక్కడికి వస్తారు. మరి, అక్కడ రాహుల్ ని చూశారో లేదో , అప్పటికే అరుణ్ తప్పించుకున్నాడో చూడాలి.


 

click me!