
బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో షో ముగియనుంది. 14వ వారం శోభ శెట్టి ఎలిమినేట్ అయ్యింది. శివాజీ, శోభ డేంజర్ జోన్లో మిగిలారు. వీరిలో శోభ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. శోభ శెట్టి హౌస్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఎదుట ఉన్నది ఎవరైనా తన మాటలతో దాడి చేసేది. శోభ శెట్టి సీరియల్ బ్యాచ్ లో ఒకరు. అమర్, ప్రియాంక, శోభ కలిసి గేమ్ ఆడారు.
వీరికి స్పై బ్యాచ్ గా ఉన్న శివాజీ, ప్రశాంత్, యావర్ నుండి గట్టి పోటీ ఎదురయ్యేది. స్పై బ్యాచ్ స్పా బ్యాచ్ కి అసలు పడదు. ఇక శోభ శెట్టి తన ప్రవర్తనతో నెగిటివిటీ మూటగట్టుకుంది.దీంతో శోభ శెట్టిని ఎలిమినేట్ చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపించింది. నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి అనధికారిక ఓటింగ్ లో శోభ లీస్ట్ లో ఉండేది. కానీ ఎలిమినేట్ అయ్యేది కాదు. స్టార్ మా ఆమెను కాపాడుతూ వచ్చారనే వాదన ఉంది.
శోభను కాపాడేందుకు కొందరు టాప్ కంటెస్టెంట్స్ బలి అయ్యారనే టాక్ నడిచింది. శోభ మీద ఉన్న వ్యతిరేకత బయట కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఊరేగింపుగా ఇంటికి వెళుతున్న శోభ శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. కారు ఓపెన్ టాప్ నుండి శోభ ఫ్యాన్స్ ని పలకరిస్తుంది. ఓ వ్యక్తి ఆమెకు వినిపించేలా 'ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చారు' అని గట్టిగా అరిచాడు. శోభకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నవ్వు ముఖంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక శోభ శెట్టి హౌస్లో 14 వారాలు ఉంది. ఆమె వారానికి రూ. 2. 25 లక్షలు తీసుకున్నారట. దాంతో ఆమెకు 31.5 లక్షల రెమ్యూనరేషన్ దక్కిందని సమాచారం. అత్యంత ఆదరణ పొందిన సీరియల్ కార్తీకదీపంలో శోభ శెట్టి విలన్ మోనిత పాత్ర చేసింది. ఆ విధంగా ఆమె పాప్యులర్ అయ్యారు.