అపరిచితుడు గెటప్ లో ప్రశాంత్ .. గజినీ లా అమర్  .. వాట్ ఏ క్రియేటివిటీ!

Published : Dec 10, 2023, 06:38 PM IST
అపరిచితుడు గెటప్ లో ప్రశాంత్ .. గజినీ లా అమర్  .. వాట్ ఏ క్రియేటివిటీ!

సారాంశం

సండే ఫండే అంటూ హోస్ట్ నాగార్జున షో ఎంటర్టైనింగ్ గా నడిపించారు. కొన్ని ఆటలు ఆసక్తి రేపాయి. బిగ్ బాస్ హౌస్ లో సండే ఫన్ మాములుగా లేదు. ఇందుకు సంబంధించిన ప్రోమోలో ఓ ఫన్ గేమ్ ఆడించారు నాగార్జున. 

బిగ్ బాస్ హౌస్ లో సండే ఫన్ మాములుగా లేదు. ఇందుకు సంబంధించిన ప్రోమోలో ఓ ఫన్ గేమ్ ఆడించారు నాగార్జున. ఇందులో భాగంగా స్లిప్ మీద రాసి ఉన్న మూవీ పేర్లు చూసి నోటితో చెప్పకుండా యాక్ట్ చేసి చూపించాలిని నాగార్జున చెప్పారు.  ఇక మిగిలిన హౌస్ మేట్స్ సినిమా పేరు గెస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఇలా సినిమా పేరు గెస్ చేసి చెప్పిన తర్వాత అదే గెటప్ లో ఇంటి సభ్యుల ఫోటోలు చూపించారు నాగార్జున. 

ముందుగా అర్జున్ ని బాహుబలి గెటప్ లో చూపించారు. ఇక మహానటి సినిమాలో కీర్తి సురేష్ లా ప్రియాంక కనిపించింది. తర్వాత శోభా కి సరిగ్గా తన గెటప్ కి సంబంధిన సినిమా పేరు వచ్చింది. చంద్రముఖి లాగ శోభా భలే సెట్ అయింది. అపరిచితుడు గెటప్ లో ప్రశాంత్ కనిపించాడు. గజినీ లా అమర్ ఫోటో వచ్చింది. ఇక తర్వాత స్పెషల్ గెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఎంట్రీ ఇచ్చారు. 

కాగా కీరవాణితో గారితో కాసేపు సరదాగా ముచ్చటించారు నాగ్. ఇక  ఇంటి సభ్యులను ఆయనకు పరిచయం చేశారు. కీరవాణి గారు నా ఫిల్మ్ '' నా సామి రంగ '' కి మ్యూజిక్ చేస్తున్నారు అని కంటెస్టెంట్స్ తో నాగార్జున చెప్పారు. 

ఇది బిగ్ బాస్ షో కాబట్టి .. మీ ఇంట్లో ఎవరు బిగ్ బాస్ అని కీరవాణి ని నాగ్ అడిగారు. పేరుకు నేనే కానీ .. ప్రాక్టికల్ గా చూస్తే .. నా వైఫ్ శ్రీవల్లి నే బిగ్ బాస్ అంటూ జోక్ చేశారు కీరవాణి గారు. ఇలా సరదాగా ప్రోమో  ముగిసింది. 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 11 ఎపిసోడ్ : మీనాని ఏడిపించేసిన అత్త, ప్రభావతి కి లెఫ్ట్ రైట్ వాయించిన శ్రుతి
Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు