ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, బుల్లితెర నటి వైశాలి ఠక్కర్‌ ఆత్మహత్య

Published : Oct 16, 2022, 04:32 PM IST
ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, బుల్లితెర నటి వైశాలి ఠక్కర్‌ ఆత్మహత్య

సారాంశం

వరుస విషాదాలు ఫిల్మ్ ఇండస్ట్రీని ముంచెత్తుతున్నాయి. వారుసగా సినిమా ఇండస్ట్రీని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు ఆర్టిస్ట్ లు. కొంత మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ బుల్లితెర నటి వైశాలీ ఠక్కర్ ఆత్యహత్య చేసుకుంది. 

వరుస విషాదాలు ఫిల్మ్ ఇండస్ట్రీని ముంచెత్తుతున్నాయి. వారుసగా సినిమా ఇండస్ట్రీని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు ఆర్టిస్ట్ లు. కొంత మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ బుల్లితెర నటి వైశాలీ ఠక్కర్ ఆత్యహత్య చేసుకుంది. 

ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో  విషాదం జరిగింది.  ప్రముఖ బుల్లితెర నటి, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు ససురాల్‌ సిమర్‌ కా టీవీ షో ఫేమ్‌ వైశాలి ఠక్కర్‌ ఆత్మహత్య చేసుకున్నది. మధ్యప్రదేశ్‌ లోని  ఇండోర్‌ నగరంలో సాయిబాగ్‌లోని తన ఇంట్లో నటి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైశాలి ఆత్మహత్య వార్త ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. అయితే ఈ సూసైడ్ కు సంబంధించి ఆమె ఓ నోట్ కూడా రాసినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. 

ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ఆమె ఏం రాసింది అన్న విషయంలో క్లారిటీ ఇంకా రాలేదు.  ఆత్మహత్యకు, నోట్‌లో వైశాలి పేర్కొన్న కారణాలు ఏంటన్నది తెలియరాలేదు. అయితే  ప్రాథమికంగా జరిగిన  విచారణలో ఆమె  ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం లో ఫార్మాలిటీస్ అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టానికి తరలించారు.

యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్‌తో కెరీర్‌ను ప్రారంభించింది వైశాలీ ఠక్కర్. ఇక ఈమె గురించి వివరాలు చూస్తే.. ఉజ్జయినిలోని మహిద్‌పూర్‌ లో  వైశాలి జన్మించింది. .ఈ సీరియల్‌లో సంజన పాత్రను పోషించగా.. మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ససురాల్‌ సిమర్‌ కా సీరియల్‌లో అంజలి పాత్ర వైశాలీకి ఎక్కడ లేని పేరును తెచ్చిపెట్టింది. ఆతరువాత ఆమెకు అవకాశాలు వెల్లువల వచ్చి పడ్డాయి.  

 వైశాలి యే వాదా రహా, యే హై ఆషికి, సూపర్ సిస్టర్, లాల్ ఇష్క్. ఔర్‌ విష్, అమృత్‌ లాంటి ఎన్నో సీరియల్స్‌లోనటించిమెప్పించింది. ఆ సీరియల్స్ లో ఆమె  కీలకపాత్రలు పోషించింది. టీవీ సీరియల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది గతంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన  దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌కు వైశాలి క్లోజ్ ఫ్రెండ్. ఇంద్దరు కలిసే ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయన మరణం సమయంలో కూడా ..సుశాంత్‌ ఆత్మహత్యను వైశాలి ఠక్కర్‌ హత్యగా ఆరోపించింది. రియా చక్రవర్తి వల్లనే ఆయన మరణించాడని ఆరోపించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు