బాలయ్యా.. మ్యాటర్ తేల్చయ్యా, టెన్షన్ తో ట్విట్టర్ తడిసిపోతోంది

Published : Oct 16, 2022, 04:23 PM ISTUpdated : Oct 16, 2022, 04:24 PM IST
  బాలయ్యా.. మ్యాటర్  తేల్చయ్యా, టెన్షన్ తో ట్విట్టర్ తడిసిపోతోంది

సారాంశం

 'అఖండ' హిట్ తరువాత బాలయ్య .. 'క్రాక్' హిట్ తరువాత గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ రోజుల్లో బాలయ్య ఏది చేసినా అది హాట్ టాపిక్ గా మారిపోతోంది. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ దిగ్విజయంగా సాగుతున్నాయి. తాజాగా ఆయన ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారిపోయారు. అయితే ఈ మ్యాటర్ అన్ స్టాపబుల్ గురించి కాదు. ఆయన తాజా చిత్రం NBK107 గురించి.

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రకటన వచ్చే శుక్రవారం జరగనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం #NBK107గా వ్యవహిస్తున్నారు.  ఈ నేపధ్యంలో అక్టోబర్ 21న టైటిల్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించకపోవటం అంతటా చర్చనీయాంశంగా మారింది.

#NBK107 రిలీజ్ డేట్ గా జనవరి 07 లేదా 12 జనవరి 23ని  టార్గెట్ గా పెట్టుకున్నారా?అనేది మీడియాలో నలుగుతున్న అంశం. అలాగే డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్‌లో సమాచారం ప్రకారం, ఈ  తేదీలలో ఒకదానిలో విడుదల  అవుతుంది. రీసెంట్ గా మైత్రీ మూవీ మేకర్స్ ప్రెస్ నోట్‌ను విడుదల చేసారు.  అక్కడ చిరంజీవి నటించిన వారి మెగా154 చిత్రం 2023 సంక్రాంతికి వస్తుందని హింట్ ఇచ్చారు. బాలకృష్ణ కూడా అదే మేకర్స్ నిర్మించిన NBK107తో 2023 సంక్రాంతికి రావాలని కోరుకుంటున్నట్లు ఇన్ సైడ్ రిపోర్ట్  . అక్టోబర్ 21న సినిమా టైటిల్‌ను ప్రకటిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ ప్రెస్ నోట్‌ని విడుదల చేసారు. అఖండ భారీ విజయం తర్వాత బాలయ్య హీరోగా విడుదల కాబోతున్నందున ఈ చిత్రం చాలా హైప్‌ని సృష్టించింది. దాంతో అందరి దృష్టీ ఈ రిలీజ్ డేట్ పైనే ఉంది. అయితే ఈ ప్రెస్ నోట్‌లో అక్టోబర్ 21 న విడుదల తేదీని ప్రకటిస్తారా లేదా అనే దానిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.

మరో ప్రక్క ఈ చిత్రం టైటిల్ గా ‘జై బాలయ్య’, ‘రెడ్డి గారు’, ‘వీరసింహారెడ్డి’ వంటి టైటిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ‘వీరసింహారెడ్డి’ ఖరారైందని అభిమానులు అంటున్నారు. “సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొన్ని టైటిల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వారు ఖరారు చేసిన అసలు టైటిల్‌ను మరో ఐదు రోజుల్లో వెల్లడిస్తాం’’ అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే 
 
రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విలన్ గా దునియా విజయ్ నటిస్తున్నాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు.  ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇందులో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుంది. అలానే సెకండ్ హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హానీ రోజ్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

 బాలకృష్ణ డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్నారు. 'అఖండ' హిట్ తరువాత బాలయ్య .. 'క్రాక్' హిట్ తరువాత గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. సంక్రాంతి బరిలో ఆయన అందుకున్న సక్సెస్ లు ఎక్కువ. అందువలన ఈ సినిమాను సంక్రాంతికే  విడుదల చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్‌⁠లు ఇవే.. సంచలనం సృష్టించిన చిన్న సినిమా, తప్పక చూడాల్సిన థ్రిల్లర్స్ రెడీ
Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే