
ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయిన జంటలు చిత్ర పరిశ్రమలో చాలానే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు బుల్లితెర నటీనటుల మధ్య కూడా జరుగుతున్నాయి. బెంగళూరుకి చెందిన రచిత మహాలక్ష్మి కన్నడ, తమిళ టివి సీరియల్స్ తో బాగా పాపులర్ అయింది. అంతే కాదు తమిళ బిగ్ బాస్ 6 సీజన్ లో కూడా పాల్గొని మరింత ఫేమస్ అయింది.
రచిత 'పిరివోమ్ శాంతిప్పోమ్' అనే టీవీ సీరియల్ తో 20111లో గుర్తింపు తెచ్చుకుంది. మరో బుల్లితెర నటుడు దినేష్ గోపాల్ స్వామిని ప్రేమించి వివాహం చేసుకుంది. 2015లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటీవల వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయారు. విడాకులు పొందలేదు కానీ ఇద్దరూ కలసి ఉండడం లేదు.
మనస్పర్థలు తీవ్ర స్థాయికి చేరడంతో ఇద్దరూ విడిగా ఎవరి జీవితాలు వారు సాగిస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు ఇంకా తొలగిపోలేదు. ఇద్దరికీ ఇంకా సంతానం కూడా లేదు. తన భర్తతో విడిపోయిన విషయాన్ని రచిత బిగ్ బాస్ 6లో కూడా ఖరారు చేసింది. అయితే దినేష్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ మధ్య మనస్పర్థలు తొలగిపోతాయని.. ఇద్దరం కలసి జీవించే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అయితే తాజాగా జూన్ 21 అర్థరాత్రి రచిత మహాలక్ష్మి దినేష్ పై పోలీస్ కంప్లైంట్ నమోదు చేసింది. రచిత చెన్నై శివారులో పోరూరులో నివాసం ఉంటోంది. విడిపోయినప్పటికీ దినేష్ ఆమెకి అసభ్యకరమైన, అశ్లీలమైన సందేశాలు పంపిస్తున్నాడట. వాట్సాప్ లో, పేస్ బుక్ లో అసభ్యంగా మెసేజ్ లు పెడుతుండడంతో రచిత విసిగిపోయి జూన్ 21న అర్థరాత్రి మాంగాడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. దినేష్ పై ఫిర్యాదు చేసింది.
దీనితో పోలీసులు దినేష్ ని పిలిచి విచారించగా.. ఆమె అనవసరంగా తన పై ఆరోపణలు చేస్తోంది అని.. అవసరం అయితే విడాకులకు సిద్ధం కావాలని పోలీసులకు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రచిత క్లోజ్ ఫ్రెండ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఓ యువతి దినేష్ పై గతంలో ఫిర్యాదు చేసింది. తన వల్లే రచిత.. దినేష్ నుంచి విడిపోయినట్లు అతడు బయట అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇప్పుడు రచితనే స్వయంగా దినేష్ పై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.