
హీరో సిద్దార్ద్ కు ఒకప్పుడు బోలెడు క్రేజ్ ఉండేది. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్దార్థ్. కానీ ఆ స్టార్‌డమ్‌ను అంతే జాగ్రత్తగా కాపాడుకోలేకయాడు. వరుస ప్లాఫ్ లతో తెలుగు చిత్ర సిని పరిశ్రమకు దూరమయ్యాడు. ఒరేయ్ బామ్మర్ది, మహాసముద్రం చిత్రాలతో మళ్లీ తెలుగు ఆడియన్స్‌ను పలకరించినప్పటికీ సక్సెస్ మాత్రం ఆమడ దూరంలో ఉండిపోయింది. దాంతో తెలుగులో ఎలాగైనా తిరిగి పట్టు సాధించాలన్న కసితో టక్కర్‌తో ముందుకు వచ్చాడు సిద్దార్థ్.
తమిళ దర్శకుడు కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. శుక్రవారం (జూన్ 9న) తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా మార్నింగ్ షోకే డిజాస్టర్ అయ్యింది. అప్పటికి తన ఇమేజ్ కు స్టైల్‍కు భిన్నంగా యాక్షన్ సినిమాగా టక్కర్‌ను చేశాడు సిద్ధార్థ్. అయితే, ఈ చిత్రం కూడా అతడికి నిరాశే మిగిల్చింది. దాంతో థియేటర్ లో చూద్దామనుకున్న చాలా మంది టాక్ చూసి ఆగిపోయారు. టక్కర్ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.
టక్కర్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూలై 6న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి టక్కర్ సినిమా రానుందని తెలుస్తోంది. ఆ రోజు నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ ఉంటుందని సమాచారం. అయితే, విడుదల తేదీ విషయంపై అఫీషియల్ ఎనౌన్సమెంట్ రావాల్సి ఉంది.
టక్కర్ మూవీలో సిద్ధార్థ్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటించింది. యూత్ ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం వచ్చింది. టక్కర్ సినిమాకు కార్తీక్ జీ దర్శకత్వం వహించాడు. పేద కుటుంబం నుంచి వచ్చి డబ్బు సంపాదించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్న యువకుడి పాత్రలో సిద్ధార్థ్ నటించాడు. ఈ మూవీ మొత్తం డబ్బు, లవ్ చుట్టూ తిరుగుతుంది. టక్కర్ సినిమాలో యోగి బాబు, అభిమన్యు సింగ్, మునిస్కాంత్, ఆర్జే విఘ్నేశ్ కాంత్ కీలక పాత్రల్లో కనిపించారు. నివాస్ ప్రసన్న సంగీతం అందించాడు. సుధాన్ సుందరం, జీ జయరామ్ నిర్మించిన ఈ చిత్రం ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై వచ్చింది. తమిళంలో రూపొందిన ఈ చిత్రం.. తెలుగులోనూ విడుదలైంది.