నటి అరెస్ట్.. పదిరోజుల తరువాత బెయిల్ పై బయటకి!

Published : Jun 29, 2018, 12:06 PM IST
నటి అరెస్ట్.. పదిరోజుల తరువాత బెయిల్ పై బయటకి!

సారాంశం

తమిళనాడులో స్టెరిలైట్ కర్మాగార వ్యతిరేక ఆందోళనలో పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన 

తమిళనాడులో స్టెరిలైట్ కర్మాగార వ్యతిరేక ఆందోళనలో పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తూత్తుకుడిలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు. ప్రముఖ టీవీ నటి నిలానీ కూడా ఈ విషయంపై స్పందించింది. ఆరోజు ఆమె పోలీస్ డ్రెస్ ధరించి షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతో అదే డ్రెస్ లో ఓ వీడియో విడుదల చేశారు.

అందులో ఆమె పోలీసు డ్రెస్ తో నటిస్తున్నందుకు సిగ్గు పడుతున్నాను అంటూ తూత్తుకుడిలో జరిగిన సంఘటనపై పోలీసులను విమర్శించారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి ఈ నెల 19న అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె సైదాపేట కోర్టులో బెయిలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని షరతుల మీద ఆమెకు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Bhoot Bangla OTT: భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ డేట్.. అక్షయ్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Karuppu Collections: బాక్సాఫీసు వద్ద 'కరుప్పు సునామీ.. 13 రోజుల్లో రికార్డ్ కలెక్షన్లు.. సూర్య మరో ట్రీట్‌