కరోనాను జయించిన నవ్య స్వామి... మానసికంగా పోరాటమేనంటూ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 26, 2020, 04:57 PM ISTUpdated : Jul 26, 2020, 10:46 PM IST
కరోనాను జయించిన నవ్య స్వామి... మానసికంగా పోరాటమేనంటూ వ్యాఖ్యలు

సారాంశం

బుల్లితెర నటి నవ్య స్వామి కరోనాను జయించారు. తన క్వారంటైన్ గడువు ముగిసిందని ఆమె శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు

బుల్లితెర నటి నవ్య స్వామి కరోనాను జయించారు. తన క్వారంటైన్ గడువు ముగిసిందని ఆమె శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు.

‘‘ నా క్వారంటైన్ ముగిసింది.. ముందుకన్నా ఇప్పుడు బాగానే ఉన్నాను. తల్లిదండ్రుల ప్రార్థనలు, మీ ప్రేమాభిమానాల వల్ల కరోనాను జయించాను. మీ సపోర్ట్ లేకపోయుంటే ఈ ప్రయాణం పూర్తయ్యేదే కాదు. తన కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.. ప్రస్తుతం బయట పరిస్థితులు  అస్సలు బాగోలేదు. దయ చేసి అందరూ అప్రమత్తంగా ఉండండి. కరోనాను నయం చేయవచ్చు. కానీ చికిత్స కన్నా నివారణ మేలు అన్న విషయం గుర్తుంచుకోండి’’ అని నవ్య స్వామి తెలిపారు.

మరోవైపు వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూ‌లో మాట్లాడుతూ... శారీరక పోరాటం కన్నా మానసిక పోరాటమే ఎక్కువ అని గ్రహించానని ఆమె చెప్పారు. అందుకే మరింత శక్తి కూడదీసుకుని పోరాడానని నవ్య అన్నారు.

మా ఇంటి చుట్టుపక్కల వాళ్లు ప్రతి ఒక్కరూ.. మా ఇంటికి దూరంగా ఉండాలని చెప్తుంటే బాధగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వచ్చిన దానికన్నా కూడా ఇదే మరింత బాధిస్తుందని నవ్య స్వామి వాపోయారు. కాగా గత నెల 30న తనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. 


 

 

 

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది