విషాదం: కరోనాతో ప్రముఖ టీవీ నటి కన్నుమూత

Published : Nov 22, 2021, 07:48 PM IST
విషాదం: కరోనాతో ప్రముఖ టీవీ నటి కన్నుమూత

సారాంశం

హిందీ టీవీ నటి మాధవి గోగటే(53) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో హిందీ టీవీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. 

హిందీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హిందీ టీవీ నటి మాధవి గోగటే(53)(Madhavi Gogate) కన్నుమూశారు. ఆమె కరోనా నుంచి కోలుకున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. మాధవి గోగటేకి ఇటీవల కరోనా సోకింది. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. కరోనా నుంచి ఆమె కోలుకుంటున్నారు. కానీ ఇతర అనారోగ్య కారణాలతో ఆమె ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 

మాధవి గోగతే.. రూపాలి గంగూలి రూపొందించిన `అనుపమా` అనే షోతో మాధవి గోగటే పాపులర్‌ అయ్యారు. ఇందులో ఆమె అనుపమాకి తల్లి పాత్రలో నటించారు. ఈ షో బాగా పాపులర్‌ కావడంతో మాధవికి మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఆమె హఠాన్మరణంతో హింటీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్బాంతికి గురయ్యింది. మాధవి గోగటే మరణంపై రూపాలి గంగూలి స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం. చాలా కోల్పోయామని తెలిపారు. 

మాధవి ఫ్రెండ్, నటి నీలు కోహ్లి స్పందిస్తూ ఎమోషనల్‌ నోట్‌ని పంచుకున్నారు. తన ప్రియమైన స్నేహితురాలు మాధవి గోగటే ఇకలేరు. ఆమె ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. `హార్ట్ బ్రేక్‌ అయిపోయింది. చాలా చిన్న వయసులోనే ఆమె మమ్మల్ని విడిచివెళ్లిపోయారు. మీ సందేశానికి నేను రిప్లై ఇవ్వనందుకు ఇప్పుడు రియలైజ్‌ అవుతున్నా. చాలామిస్‌ అవుతున్నా` అని చెప్పారు. వీరితోపాటు టీవీ సెలబ్రిటీలు మేహుల్‌ నిసార్, షీలా శర్మ, డెల్నాజ్‌ ఇరానీ, హేషా రుఘని, రషద్‌ రానా, ఆశిష్‌ మెహరోత్రా వంటి ప్రముఖులు సంతాపం తెలిపారు.

టీవీ నటి మాధవి `అనుపమా` షోతోపాటు పలు టీవీ సీరియల్స్, సినిమాల్లనూ నటించారు. `ఘంచక్కర్‌` మరాఠి సినిమాలోనూ మంచి పాత్ర పోషించారు. వీటితోపాటు `భ్రమచా బోపాలా`, `తేలా మాధవ్‌ కునికడే` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక ఆమె `తుజా మజా జమ్టే` సీరియల్ తో నటిగా ఎంట్రీ ఇచ్చారు. `కోయి అప్నా సా`, `హైసా కభీ సోచా నా థా`, `కహిన్‌ తోహ హోగా` టీవీ సీరియల్స్ లోనూ నటించి ఆకట్టుకున్నారు.

also read: ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్.. కరోనా పాజిటివ్, ఆందోళనలో అభిమానులు
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు
Annagaru Vostaru:అన్నగారు వస్తారా ? రారా ? బాలకృష్ణ తర్వాత కార్తీ సినిమాకు చుక్కలు చూపిస్తున్న హైకోర్టు