విషాదం.. ప్రముఖ సీరియల్ నటుడి తండ్రి మృతి!

By Asianet News  |  First Published May 24, 2023, 8:07 PM IST

‘గుప్పెడంత మనస్సు’ హీరో రిషి (ముఖేశ్ గౌడ) ఇంట తీవ్ర విషాదం జరిగింది. ప్రాణం కంటే ఎక్కువగా చూసున్న ఆయన తండ్రి ప్రాణాలు కోల్పోయారు.
 


‘గుప్పెడంత మనస్సు’ హీరో రిషిగా గుర్తింపు దక్కించుకున్న యువ నటుడు ముఖేశ్ గౌడ (Mukesh Gowda)  ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్న తన తండ్రి తాజాగా తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న ముఖేశ్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ముఖేశ్ తండ్రి మరణవార్త తెలుసుకొని ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. 

ముఖేశ్ అభిమానులు సోషల్ మీడియా వేదికన ఆయన తండ్రి మరణవార్తను తెలియజేశారు. దీంతో ఆయన మృతికి నివాళి అర్పిస్తున్నారు. పలువురు సెలబ్రెటీలు కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ముఖేశ్ కు ధైర్యంగా చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. 

Latest Videos

అయితే బుల్లితెరపై జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్ లో తన తండ్రి, తల్లిని ముఖేశ్ గౌడ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ సందర్బంగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘తన తండ్రి పక్షవాతంతో బాధపడుతున్నట్టు తెలిపారు. ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నట్టు తెలిపారు. మా నాన్నను సొంత కొడుకులా చేసుకుంటున్నాను. ఇది నా జీవితంలో అదృష్టంగా భావిస్తున్నాను‘ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. తండ్రిని చక్కగా చూసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచాడని అంటున్నారు.

ముఖేశ్ కర్ణాటకకు చెందిన వాడైన తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. బుల్లితెర హీరోగా స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ’గుప్పెడంత మనస్సు’ సీరియల్ తో టీవీ ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నారు. తొలుత మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించాడు ముఖేశ్. 2015లో మోడలింగ్ లో మిస్టర్ కర్ణాటక టైటిల్ ను పొందారు. 

ఆ తర్వాత 2017 ‘నాగకన్నికే’ సీరియల్‌తో కన్నడ టెలివిజన్‌లోకి అడుగుపెట్టారు. ప్రేమ ఎంత మధురం ఫేమ్ వర్ష హెచ్‌కేతో కలిసి ‘నాగమండల’లోనూ కనిపించాడు. ఆ తర్వాత ముఖేష్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ సంప్రదించి ‘ప్రేమ నగర్’ సీరియల్‌తో అరంగేట్రం చేయించింది. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న డైలీ సీరియల్ 'గుప్పెంత మనసు'లో రక్షా గౌడతో కలిసి నటిస్తున్నాడు. 
 

click me!