
'పెళ్లి సందD' తర్వాత శ్రీలీల జోరు మాములుగా లేదు. వరుస చిత్రాలకు ఈ యంగ్ బ్యూటీ సైన్ చేస్తోంది. ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే మహేష్ బాబు చిత్రంలో కూడా నటిస్తోంది. నితిన్ తదుపరి చిత్రంలో కూడా శ్రీలీలనే హీరోయిన్. విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా స్టార్ హీరోలందరితో జోడి కడుతోంది.
ధమాకా చిత్రంలో శ్రీలీలకి క్రేజీ గ్లామర్ రోల్ దక్కింది. దీనితో ఈ యంగ్ బ్యూటీ రెచ్చిపోయి పెర్ఫామ్ చేసింది. ముఖ్యంగా సాంగ్స్ లో ఆమె డ్యాన్స్, హావభావాలు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. పూజ హెగ్డే, రష్మిక లాంటి టాప్ హీరోయిన్లకు కాంపిటీషన్ వచ్చేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా శ్రీలీల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ ఆడియన్స్ హీరోలని చూసే సినిమా టికెట్స్ కొంటున్నారు అని వ్యాఖ్యలు చేసింది. మొదటిరోజు టికెట్స్ కొనేది హీరోలని చూసే. నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను. సినిమా మొత్తం నేనే కనిపించాలని అనుకోను.. మంచి పాత్ర దొరికితే చాలు అని అనుకుంటా అని శ్రీలీల తెలిపింది.
ధమాకా చిత్రం ఆ రేంజ్ లో కాసుల వర్షం కురిపించడానికి ప్రధాన కారణం శ్రీలీల అనే ప్రచారం జరిగింది. ఆమె గ్లామర్, డ్యాన్స్ వల్ల యువత ఎగబడ్డారు అని.. సినిమాలో ఆమె డామినేట్ చేసింది అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఆ ప్రచారానికి అడ్డుకట్టగా శ్రీలీల ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అని అంటున్నారు.