నువ్వెంత ఆర్గుమెంట్ చేసిన నేను తగ్గను.. జర్నలిస్ట్ కి హరీష్ శంకర్ వార్నింగ్, గొడవ ఎందుకంటే

Published : May 24, 2023, 08:01 PM IST
నువ్వెంత ఆర్గుమెంట్ చేసిన నేను తగ్గను.. జర్నలిస్ట్ కి హరీష్ శంకర్ వార్నింగ్, గొడవ ఎందుకంటే

సారాంశం

కేరళ నుంచి వచ్చిన మరో సంచలన చిత్రం 2018. జూడ్ అంథోని జోసెఫ్ దర్శకత్వంలో టీవీనో థామస్, అపర్ణ బాలమురళి, కుంచక్కో బోబన్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు.

కేరళ నుంచి వచ్చిన మరో సంచలన చిత్రం 2018. జూడ్ అంథోని జోసెఫ్ దర్శకత్వంలో టీవీనో థామస్, అపర్ణ బాలమురళి, కుంచక్కో బోబన్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు. 2018లో కేరళ రాష్ట్రాన్ని వరదలు ఎలా అతలాకుతలం చేశాయో తెలిసిందే. వరదలు సృష్టించిన విధ్వంసంలో ఎంతో మంది కేరళ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలా ఏమండీ నిరాశ్రయులు అయ్యారు. 

అప్పటి పరిస్థితులని ఎలా ఎదుర్కొన్నారో దర్శకుడు ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. దీనితో ఈ చిత్రం మళయాళంలో వంద కోట్ల దిశగా దూసుకుపోతోంది. తెలుగులో ఈ నెల 26న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. బన్నీ వాసు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడంలో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రమేయం కూడా ఉంది. 

కాగా నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ తో పాటు హరీష్ శంకర్ కూడా పాల్గొన్నారు. అయితే జర్నలిస్ట్, పిఆర్ అయిన సురేష్ కొండేటికి.. హరీష్ శంకర్ కి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. అయితే ఇద్దరూ సరదాగానే మాట్లాడుకుంటూ చర్చించుకున్నారు. అయితే ఈ వివాదం సురేష్ అడిగిన ప్రశ్న వల్ల మొదలైంది. బన్నీ వాసుని.. మీరు వరుసగా డబ్బింగ్ సినిమాలే రిలీజ్ చేస్తున్నారు అని ప్రశ్నించారు. అలాగే మన తెలుగు దర్శకులు, హీరోలు ఇలాంటి రియలిస్టిక్ చిత్రాలు చేయడానికి ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. 

ఈ ప్రశ్న పక్కనే ఉన్న హరీష్ శంకర్ కి ఆగ్రహం తెప్పించింది. మీరు ఇటీవల ఎక్కువగా వివాదాస్పద ప్రశ్నలు అడుగుతూ అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నారు అంటూ హరీష్ చురకలంటించారు. వినేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అంట అని హరీష్ శంకర్ అన్నారు. మీరు అడిగిన ప్రశ్న నాకు నచ్చలేదు. 

అసలు డబ్బింగ్ సినిమాలు అని అనడం ఏంటి.. ఇప్పుడు టెక్నాలజీ వల్ల ప్రపంచం సినిమా మొత్తం మన అరచేతుల్లో ఉంది. ఇంకా డబ్బింగ్ సినిమా అని వేరు చేయడం ఏంటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలని నార్త్ వాళ్లు డబ్బింగ్ సినిమాలు అనుకున్నారా అని ప్రశ్నించారు. నీకు ఆర్గుమెంట్ కావాలనుకుంటే నేను కదలను.. ఎంతసేపైనా మాట్లాడుకుందాం అని హరీష్ అన్నారు. డబ్బింగ్ సినిమాలు చేయడం తప్పు కాదు.. మంచి సినిమానా కాదా అనేది మాత్రమే చూడాలి అని హరీష్ అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా