'టక్ జగదీష్' పై రూమర్,టీమ్ క్లారిటీ

By Surya PrakashFirst Published May 27, 2021, 3:15 PM IST
Highlights

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.   జగపతిబాబు నాని అన్న గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘టక్ జగదీష్’ పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ మధ్యకాలంలో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. కరోనా ప్రభావంతో థియేట‌ర్లు తాత్కాలికంగా మూత‌బ‌డ‌టంతో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రతీ చిత్రం ఓటీటిలో విడుద‌ల‌వుతుందంటూ ప్ర‌చారం మొదలవుతోంది. వెంటనే ఆ సినిమా వాళ్లు సీన్ లోకి వచ్చి అబ్బే అదేం లేదు అని ప్రకటన ఇస్తున్నారు. తాజాగా  ‘ట‌క్ జ‌గ‌దీష్’ సినిమా కూడా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ప్ర‌సార హ‌క్కుల్ని సొంతం చేసుకుంద‌ని నెట్టింట వైర‌ల్ అవుతోంది. తాజాగా వీటిపై స్పందించింది చిత్ర టీమ్ . ‘ట‌క్ జ‌గ‌దీష్’ చిత్రం థియేట‌ర్ల‌లోనే విడుద‌ల‌వుతుంది. అన‌ధికారిక వార్త‌ల్ని న‌మ్మ‌కండి’ అని స్ప‌ష్ట‌త ఇచ్చింది. 

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.   జగపతిబాబు నాని అన్న గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘టక్ జగదీష్’ పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే కరోనా కల్లోలం కారణంగా సినిమా షూటింగ్ లన్నీ నిలిచిపోయి రిలీజ్ డేట్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘టక్ జగదీష్’ సినిమా కూడా వాయిదా పడింది.  దాంతో ఈ సినిమాపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని ఏప్రిల్ 30న విడుదల చేయాలనుకున్నారు. ప‌రిస్థితులు చ‌క్క‌బడ్డాక కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు.

”టక్ జగదీష్ సినిమా థియేటర్లలోనే విడుదల అవుతుంది. ఇది థియేటర్ ఎక్సపీరియన్స్ కోసం రూపొందిస్తున్న సినిమా ఇది. దయచేసి ఓటీటీ రిలీజ్ అంటూ వచ్చే పుకార్లను నమ్మవద్దు. టక్ జగదీష్ చిత్రాన్ని కుటుంబంతో కలిసి థియేటర్లలో చూసి ఆనందించండి” అంటూ చిత్రయూనిట్ ప్రకటించింది.

ఇక  'టక్ జగదీష్' చిత్రానికి 'నిన్ను కోరి' 'మజిలీ' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాని కెరీర్లో 26వ చిత్రంగా వస్తున్న 'టక్ జగదీష్' పై సినీ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
   

click me!