తండ్రి ఎన్టీఆర్‌ బర్త్ యానివర్సరీ గిఫ్ట్..`శ్రీరామదండకం`

Published : May 27, 2021, 09:38 AM IST
తండ్రి ఎన్టీఆర్‌ బర్త్ యానివర్సరీ గిఫ్ట్..`శ్రీరామదండకం`

సారాంశం

తండ్రి ఎన్టీఆర్‌ బర్త్ యానివర్సరీ సందర్భంగా  తనయుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. మరోసారి ఆయన గాత్రంతో పాట పాడబోతున్నారు.

తండ్రి ఎన్టీఆర్‌ బర్త్ యానివర్సరీ సందర్భంగా  తనయుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. మరోసారి ఆయన గాత్రంతో పాట పాడబోతున్నారు. ఈ విషయాన్ని బాలయ్య గురువారం వెల్లడించారు. రేపు శుక్రవారం(మే 28) ఎన్టీఆర్‌ జయంతి అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్ ని ఖుషీ చేయాలని భావించారు. సొంతంగా ఆయన పాట పాడారు. 

పవిత్ర శ్లోకమైన `శ్రీరామదండంకం` ని ఆయన ఆలపించారు. పాట రూపంలో ఆ శ్లోకాన్ని రేపు విడుదల చేయబోతున్నారు. ఉదయం 9.45నిమిషాలకు దీన్ని విడుదల చేయనున్నట్టు బాలయ్య ప్రొడక్షన్‌ సంస్థ ఎన్‌బీకే ఫిల్మ్స్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. గతేడాది తన బర్త్ డే సందర్భంగా బాలకృష్ణ `శివ శంకరీ..` అనే పాటని ఆలపించి ఫ్యాన్స్ ఫిదా చేశారు. మరి ఈ సారి తండ్రి జయంతి సందర్భంగా మరో పాట ఆయన నుంచి రావడం విశేషం. 

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` చిత్రంలో నటిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయిక. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. `సింహా`, `లెజెండ్‌` చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇది కరోనా వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలయ్య గోపీచంద్‌ మలినేనితో మరో సినిమా చేయనున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే