హీరోయిన్ గా సమంతా.. నో అంటోన్న హీరోలు!

By Udayavani DhuliFirst Published Sep 26, 2018, 4:44 PM IST
Highlights

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించేసింది. కానీ ఇప్పుడు నాగచైతన్యని పెళ్లి చేసుకొని అక్కినేని కుటుంబానికి కోడలు అయిన తరువాత ఆమెకి సినిమా అవకాశాలు రావడం కాస్త కష్టమే

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించేసింది. కానీ ఇప్పుడు నాగచైతన్యని పెళ్లి చేసుకొని అక్కినేని కుటుంబానికి కోడలు అయిన తరువాత ఆమెకి సినిమా అవకాశాలు రావడం కాస్త కష్టమే.

పెళ్లికి ముందే 'రంగస్థలం' సినిమా కమిట్ అవ్వడంతో పెళ్లయినా కూడా సినిమాను పూర్తి చేసింది. ఒకప్పుడు అగ్ర హీరోల సినిమాలకు ఫస్ట్ ఆప్షన్  సమంతా. కానీ ఇప్పుడు హీరోలు మాత్రం సమంత హీరోయిన్ అంటే వద్దని చెప్పేస్తున్నారట.

నాగార్జున మీద ఉన్న గౌరవంతోనో, నాగచైతన్యతో ఉన్న స్నేహం కారణంగానో రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ పాత్రలకి సమంతని తీసుకోకండని హీరోలు  దర్శకనిర్మాతలకు  చెబుతున్నారట. ఆమె పాత్ర గౌరవ పూర్వకంగా ఉంటే అప్పుడు తీసుకోవచ్చని సలహాలు ఇస్తున్నారట.

పెళ్లైన హీరోయిన్ కావడంతో నిర్మాతలు కూడా సమంత పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే సమంతకి మాత్రం గ్లామర్ షో విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేనట్లుగా కనిపిస్తున్నాయి. తాజాగా కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో హాట్ స్టిల్ ని పోస్ట్ చేసి తన గ్లామర్ యాంగిల్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది.  

click me!