'ఇస్మార్ట్ శంకర్' ఎఫెక్ట్... మణిశర్మపై ట్రోలింగ్!

Published : Jul 01, 2019, 11:57 AM IST
'ఇస్మార్ట్ శంకర్' ఎఫెక్ట్... మణిశర్మపై ట్రోలింగ్!

సారాంశం

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. 

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. దానికి కారణం ఆయన కంపోజ్ చేసిన ఒక పాటే.. ఈ మధ్యకాలంలో అతడికి సినిమా అవకాశాలు బాగా తగ్గాయి.. అప్పుడప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం అతడిని సంప్రదిస్తున్నారంతే.. ఈ క్రమంలో అతడికొక సినిమా ఛాన్స్ వచ్చింది.

రామ్ హీరోగా పూరిజగన్నాథ్ రూపొందిస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి 'ఉండిపో.. ఉండిపో..' అనే పాటను విడుదల చేశారు. ఆ పాటకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఈ పాట బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన 'బాద్ షాహో' సినిమాలో 'మేరే రష్ కే ఖమర్' పాటను పోలి ఉండడంతో మణిశర్మపై విమర్శలు మొదలయ్యాయి. చాలా మంది సంగీత దర్శకులు ట్యూన్స్ కాపీ కొడుతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తుండడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం.

గతంలో మణిశర్మపై కూడా ఇలాంటి ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి అతడు 'ఇస్మార్ట్ శంకర్' పాటతో నెటిజన్లకు దొరికిపోయాడు. మణిశర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇలాగేనా..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి