రెజీనాతో ఎఫైర్.. గట్టిగా నవ్వేసిన కుర్ర హీరో!

Published : Jul 01, 2019, 11:53 AM ISTUpdated : Jul 01, 2019, 11:56 AM IST
రెజీనాతో ఎఫైర్.. గట్టిగా నవ్వేసిన కుర్ర హీరో!

సారాంశం

రెజీనాతో గత కొంత కాలంగా ఒక కుర్రహీరో ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆ హీరో ఎవరో కాదు యువ హీరో సందీప్ కిషన్ అని పలు వెబ్ సైట్లలో కథనాలు వెలువడ్డాయి. 

రెజీనాతో గత కొంత కాలంగా ఒక కుర్రహీరో ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆ హీరో ఎవరో కాదు యువ హీరో సందీప్ కిషన్ అని పలు వెబ్ సైట్లలో కథనాలు వెలువడ్డాయి. రొటీన్ లవ్ స్టోరీ సినిమాలో ఈ ఇద్దరు మొదటిసారి కలిశారు. అనంతరం రారా కృష్ణయ్య - నగరం - నక్షత్రం సినిమాల్లో కూడా కనిపించారు.

అప్పటి నుంచి వీరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అయ్యిందని టాక్ వచ్చింది.  అయితే రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా నిన్నటివరకు హీరో హీరోయిన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎట్టకేలకు రూమర్స్ కు సందీప్ కిషన్ బ్రేక్ వేశాడు. ఈ రూమర్ పై ప్రశ్నలు ఎదురవ్వగానే గట్టిగా నవ్వేసిన  సందీప్ కిషన్ ఆమె తనకు మంచి ఫ్రెండ్ అని సున్నితంగా చెప్పేశాడు. 

అదే విధంగా గత రెండేళ్ల క్రితం వరకు ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నట్లు చెప్పిన సందీప్ ఆ అమ్మయికి బ్రేకప్ చెప్పినట్లు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను సింగిల్ అంటూ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలిపాడు. సందీప్ నటించిన హారర్ థ్రిల్లర్ 'నిను వీడని నీడను నేనే' సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?