తాగి సెట్లో గొడవ చేసిన రాజేంద్రప్రసాద్.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

Published : Jul 01, 2019, 11:40 AM IST
తాగి సెట్లో గొడవ చేసిన రాజేంద్రప్రసాద్.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం 'ఓ బేబీ'. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం 'ఓ బేబీ'. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషించారు. అయితే ఈ సినిమాలో ఆయన తాగే సన్నివేశంలో నటించడానికి సెట్ లో నిజంగానే మద్యం సేవించి గొడవ చేశారని, దీంతో సెట్లోని నటీమణులు అసౌకర్యానికి గురయ్యారని వార్తలు 
వినిపించాయి.

దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపై తాజాగా జరిగిన 'ఓ బేబీ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు నటుడు రాజేంద్రప్రసాద్. తను చదువుకున్న వ్యక్తినని.. సీనియర్ ఎన్టీఆర్ లా పాత్రలో లీనమైపోయి నటిస్తుంటానని చెప్పారు.

తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎన్టీఆరే అని.. ఆయన ఓ పాత్రలో నటిస్తున్నప్పుడు ఇంటికి వెళ్లేవరకు అదే పాత్రలో లీనమైపోయి ఉంటారని.. తనకు కూడా అదే అలవాటు వచ్చిందని అన్నారు. ఈ క్రమంలో 'ఓ బేబీ' సినిమాలో తాగినట్లు నటించాల్సిన సన్నివేశం ఒకటి వచ్చిందని.. దీనికోసం షాట్ రెడీ అని చెప్పడానికి ముందే మద్యం సేవిన్చినట్లుగా నటించానని చెప్పారు రాజేంద్రప్రసాద్. 

దాన్ని ఎవరో మూర్ఖుడు తప్పుగా రాశాడని.. విషయం తెలుసుకోకుండా రాయడం, అతడి కర్మ అని.. ఎవరేం అనుకున్నా తనకు అనవసరమని.. తన నటన కారణంగా సెట్లో ఎవరూ ఇబ్బందికి గురి కాలేదని స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?