
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' ట్రైలర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు.
అయితే సినిమా ట్రైలర్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయిందనేది కొందరి వాదన. ట్రైలర్ పై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వేస్తున్నారు. కొందరు మీమ్స్ కూడా తయారు చేసి ట్రైలర్ ని ట్రోల్ చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీ మొత్తం శంకర్ ని పోగుడుతుంటే.. సోషల్ మీడియాలో మాత్రం అతడు రూపొందించిన సినిమాపై జోకులు పేలుస్తున్నారు. ఈ నెలాఖరున సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. ప్రస్తుతానికైతే ట్రైలర్ పై వచ్చిన సెటైర్లపై ఓ లుక్కేయండి!