వివాహం ఎందుకు చేసుకోలేదో చెప్పి, కన్నీరు పెట్టుకున్న గీతాసింగ్

Published : Nov 07, 2018, 09:52 AM IST
వివాహం ఎందుకు చేసుకోలేదో చెప్పి, కన్నీరు పెట్టుకున్న గీతాసింగ్

సారాంశం

కితకితలు చిత్రం చూసిన వారు గీతాసింగ్ ని మర్చిపోవటం కష్టమే. ఆ సినిమాతో ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ తర్వాత ఆమె అడపాదడపా ఇవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో చేసారు కానీ ఆ స్దాయి క్యారక్టర్ పడలేదు.

కితకితలు చిత్రం చూసిన వారు గీతాసింగ్ ని మర్చిపోవటం కష్టమే. ఆ సినిమాతో ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ తర్వాత ఆమె అడపాదడపా ఇవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో చేసారు కానీ ఆ స్దాయి క్యారక్టర్ పడలేదు. ఇక ఆయన చనిపోయాక..మిగతా డైరక్టర్స్ ఆమెకు క్యారక్టర్ ఇచ్చిన వాళ్లే తగ్గిపోయారు.  నెలకో,సంవత్సరానికో అన్నట్లు అప్పటి నుంచి అడపాదడపా మాత్రమే ఆమె తెరపై కనిపిస్తూ వస్తున్నారు.

రీసెంట్ గా   గీతా సింగ్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ పోగ్రామ్ లో మాట్లాడుతూ, తన మనసులో ఉన్న విషయాలను బయటపెట్టారు. వాటిని విన్నవారి మనసు కదిలిస్తుంది. ముఖ్యంగా వివాహం ఎందుకు చేసుకోలేదో ఆమె చెప్పిన మాటలు ఎంతటివారిని అయినా గుండె చెమ్మగిల్లేలా చేస్తాయి.  

గీతా సింగ్ మాట్లాడుతూ..." మా అన్నయ్యకి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆయన అర్దాంతరంగా చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఆ ఇద్దరి పిల్లలు,కుటుంబ  పోషణ భారాన్ని నేనే చూస్తున్నా . ఇక వాళ్ల చదువు విషయంలో మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి సహాయం లభించింది. 

నేను పెళ్లిచేసుకోవచ్చు ..కానీ నేను పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలను వదిలేయమని ఖచ్చితంగా అంటారు .. వాళ్లే నా లైఫ్ అనుకున్నాను. వాళ్ల  కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. ఇలాంటి సంఘటనే నా విషయంలో  జరిగితే నా పిల్లలను మా అన్నయ్య చూసుకునేవాడు. అందుకే  అన్నయ్య పిల్లలను వదిలేయలేకనే నేను నా పెళ్లి గురించి ఆలోచించలేదు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.   

PREV
click me!

Recommended Stories

Mahesh Next Film: మహేష్‌ బాబు నెక్ట్స్ మూవీ ఫిక్స్, బాక్సాఫీసు వద్ద అరాచకమే.. `పెద్ది` డైరెక్టర్‌ కాదు
Nandamuri Chaitanya Krishna: మొదటి సినిమాలో తనకు జరిగిన అన్యాయంపై చైతన్య కృష్ణ ఆవేదన.. తప్పు జరిగింది అక్కడే