సినిమా హిట్ అయితే ఎంత క్రేజ్ వస్తుందో ..ప్లాఫ్ అయితే అదే స్దాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. అందుకు తాజాగా మంచు విష్ణు ఎన్నో ఆశలు పెంచుకున్న మోసగాళ్లు మూవీనే సాక్ష్యం. చరిత్రలో కనీ వినీ ఎరుగని భారీ స్కామ్ అని ఊరించి, కాజల్, సునీల్ శెట్టి లాంటి స్టార్లని తీసుకొచ్చి సినిమా చేసినా వర్కవుట్ కాలేదన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 50 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకున్న విష్ణు.. ఇప్పుడు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తెచ్చుకోలేకపోయారు.వరస ఫ్లాఫ్ లతో మంచు విష్ణుకు మార్కెట్ లేకపోవడంతో ఓపినింగ్స్ లేవు. అలాగే సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ కనీసం పట్టించుకోలేదు. దాంతో సినిమా పోయిందన్న బాధలో ఉన్న మంచు విష్ణుని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ...మోసగాళ్లు హాలీవుడ్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

అందుకు కారణం .. ‘మోసగాళ్లు’ సినిమాని ఇంటర్నేషనల్ స్దాయిలో తీశామని ప్రకటించాడు హీరో, నిర్మాత మంచు విష్ణు. ఈ సినిమాకి దర్శకుడు కూడా అమెరికాకి చెందిన ఫిలింమేకర్. తెలుగు వర్షన్ కన్నా హాలీవుడ్ వర్షన్ అదిరిపోతోంది, ఇంటర్ నేషనల్లో భారీ ఎత్తున విడుదల చేస్తామని విష్ణు రిలీజ్ కి ముందు చాలా చెప్పాడు. అయితే తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మరి ఇప్పుడు ఇంటర్ నేషనల్ వర్షన్ రిలీజ్ చేస్తాడా? అంటే కష్టమే. ఎందుకంటే మాతృభాష తెలుగులోనే ఎవరూ పట్టించుకోలేదు మరి గ్లోబల్ వేదికపై అంత సీన్ ఉంటుందా?అంటున్నారు.
హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీను తీసుకొచ్చి భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన మోసగాళ్లు దారుణంగా డిజాస్టర్ ఫలితం ఇవ్వటంతో కామెడీగా తయారైంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు మినిమం కోటి రూపాయల కలెక్షన్స్ కూడా రాలేదు. తనకు మార్కెట్ లేదని తెలుసు.. అయినా కూడా కథపై నమ్మకంతో ముందుకెళ్తున్నానంటూ ప్రమోషన్స్‌లోనే చెప్పాడు మంచు విష్ణు. పైగా ఖర్చుకు వెనకాడకుండా తన సినిమాలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా తీసుకొచ్చాడు. ప్రపంచాన్ని కుదిపేసిన బిగ్గెస్ట్ ఐటి స్కామ్ ఇందులో చూపించారు విష్ణు టీం. ఈ సినిమాకు కథ కూడా ఈయనే అందించాడు. భారీ హంగుల మధ్య మొన్న విడుదలైన ఈ చిత్రం తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో కలెక్షన్స్ కూడా అంతే దారుణంగా ఉన్నాయి.
అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ‘మోసగాళ్ళు’ సినిమా తెరకెక్కింది. హైదరాబాద్‌లోని బస్తీలో ఉండే అక్కాతమ్ముళ్లు టెక్నాలజీ సహాయంతో వేల కోట్లను ఎలా దోచుకున్నారు అనేదే ‘మోసగాళ్లు’ సినిమా కథ. అయితే ఇలాంటి కథను ఎంచుకోవడం సులభమే కానీ, దాన్ని తెరపై ఎలా థ్రిల్లింగ్ చూపించారు అనేదే ముఖ్యం. దానిపైనే సినిమా విజయం ఆధారపడుతుంది. ఈ విషయంలో చిత్ర దర్శకుడు కాస్త తడబడ్డాడు. రైటింగ్ కూడా చాలా వీక్ గా ఉండటం బాగా మైనస్ గా మారింది.