హీరోగా జర్నీప్రారంభమై 18ఏళ్లు.. అల్లు అర్జున్‌ ఎమోషనల్‌ పోస్ట్

Published : Mar 28, 2021, 11:36 AM IST
హీరోగా జర్నీప్రారంభమై 18ఏళ్లు.. అల్లు అర్జున్‌ ఎమోషనల్‌ పోస్ట్

సారాంశం

ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ లో ఒకరిగా, మెగా ఫ్యామిలీ హీరోగా రాణిస్తున్న అల్లు అర్జున్‌ హీరోగా కెరీర్‌ స్టార్ట్ అయి సరిగ్గా 18ఏళ్లు అవుతుంది. 2003లో ఆయన హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ  సందర్భంగా అల్లు అర్జున్‌ ఓ ఎమెషనల్‌ పోస్ట్ పెట్టాడు.

అల్లు అర్జున్‌.. ఇప్పుడు టాలీవుడ్‌ స్టయిలీష్‌ స్టార్‌. తన అద్భుతమైన డాన్స్ లతో సౌత్‌ మొత్తాన్ని ఫిదా చేసిన హీరో. గతేడాది `అల వైకుంఠపురములో` తో పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా నాన్‌ `బాహుబలి` రికార్డ్  లను తిరగరాసింది. ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ లో ఒకరిగా, మెగా ఫ్యామిలీ హీరోగా రాణిస్తున్న అల్లు అర్జున్‌ హీరోగా కెరీర్‌ స్టార్ట్ అయి సరిగ్గా 18ఏళ్లు అవుతుంది. 2003లో ఆయన హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. హీరోగా ఎంట్రీ ఇస్తూ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో బన్నీ నటించిన `గంగోత్రి` సినిమా 2003 మార్చి 28న విడుదలైంది. ఆదివారంతో ఇది 18ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ  జర్నీని గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్‌ ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ పెట్టారు. 

`నా మొదటి సినిమా విడుదలై ఇప్పటికి 18ఏళ్లు అవుతుంది. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నా హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. నిజంగా ఇన్నేళ్లపాటు నాపై కురిపిస్తున్న ప్రేమని పొందడంలో నేను అదృష్టవంతుగా భావిస్తున్నా. మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు` అని సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టాడు బన్నీ. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంకా మరెన్నో విజయాలు సాధించి మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలి ఆశీర్వదిస్తున్నారు. 

అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో బన్నీ  పుష్పరాజ్‌ అనే డీ గ్లామర్‌, మాస్‌ రోల్‌లో నటిస్తున్నారు. విలన్‌గా మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ నటిస్తుండటం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం