త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ ఫిక్స్ ? బ్లాక్ బస్టర్ మూవీ లోడింగ్

Google News Follow Us

సారాంశం

'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం తర్వాత విక్టరీ వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ఖరారు చేయలేదు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం తర్వాత విక్టరీ వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ఖరారు చేయలేదు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. దీంతో వెంకీ నెక్స్ట్ మూవీ పై ఫాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. వెంకీ తదుపరి చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉండబోతోంది అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే వెంకీ నెక్స్ట్ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో మూవీ చేయాల్సింది. కానీ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ కి ఫిక్స్ అయ్యాడు. అట్లీ మూవీ తర్వాతే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ సాధ్యమవుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నారు. త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ గురించి కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. ధనుష్, శివ కార్తికేయన్ ఇలాంటి తమిళ్ హీరోలతో సంప్రదింపు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది.

కానీ తాజా సమాచారం ఏంటంటే త్రివిక్రమ్ చివరికి విక్టరీ వెంకటేష్ తో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ కథని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. మరి కొన్ని నెలల్లోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేలా త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ విచిత్రాన్ని నిర్మించబోతున్నారు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. రెండు చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక.. వెంకటేష్ మూవీ చేయాలని డిమాండ్ చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉంది.

Read more Articles on