హరిహర వీరమల్లు ఆ తేదీన రావడం సేఫేనా ?..పవన్ ఫ్యాన్స్ లో టెన్షన్

Published : May 08, 2025, 07:25 PM IST
హరిహర వీరమల్లు ఆ తేదీన రావడం సేఫేనా ?..పవన్ ఫ్యాన్స్ లో టెన్షన్

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరి హర వీర మల్లు” సినిమా షూటింగ్ తాజాగా పూర్తైంది. పలు కారణాలతో ఇప్పటివరకు అనేకసార్లు ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరి హర వీర మల్లు” సినిమా షూటింగ్ తాజాగా పూర్తైంది. పలు కారణాలతో ఇప్పటివరకు అనేకసార్లు ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొని తన పాత్రకు సంబంధించిన చివరి భాగాన్ని పూర్తి చేశారు.

ఈ సినిమాకు సంబంధించి కొత్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, ప్రముఖ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో తమ వెబ్‌సైట్‌లో జూన్ 12ను విడుదల తేదీగా చూపించడంతో సోషల్ మీడియా వేదికలపై  ట్రెండింగ్ అయ్యింది. అయితే ఇదే ఖచ్చితమైన విడుదల తేదీయా అన్నదానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ తేదీపై పవన్ ఫ్యాన్స్ లో టెన్షన్ నెలకొంది. అది సేఫ్ రిలీజ్ డేటేనా అని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అదే సమయంలో పిల్లలకు స్కూల్స్ ఓపెన్ అవుతాయి. తల్లిదండ్రులు, పిల్లలు ఆ హడావిడిలో ఉంటారు. ఇది వీరమల్లు ఓపెనింగ్స్ పై ప్రభావం చూపొచ్చు. మరి మేకర్స్ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

ఈ చిత్రం 17వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుంది. జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఎఎం రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డెయోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో ప్రధాన విలన్‌గా నటిస్తున్నారు.

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి. సినిమా ప్రొడక్షన్ పనులు పూర్తవడంతో త్వరలో మేకర్స్ అధికారిక విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Varun Sandesh: అందుకే మాకు పిల్లలు పుట్టలేదు, వచ్చే ఏడాది గుడ్ న్యూస్ చెబుతామంటున్న హీరో
Nandamuri Balakrishna: గత 25 ఏళ్లలో బాలకృష్ణ బిగ్గెస్ట్ హిట్ ఏదో తెలుసా.. 32 సినిమాలు చేస్తే 10 హిట్లు