త్రివిక్రమ్ భయపడుతున్నాడా.. ట్రైలర్ రిలీజ్ ఆపిన కారణమిదే..

First Published Jan 5, 2018, 5:35 PM IST
Highlights
  • పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి
  • జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ కు రంగం సిద్ధం
  • ట్రైలర్ విడుదల చేయకపోవడంపై అనుమానాలు

జనవరి పది మరో నాలుగు రోజుల్లో... సినిమా రిలీజ్ చేయాల్సిన సమయం దగ్గర పడుతోంది. కౌంట్ డౌన్ మొదలైంది. ఫ్యాన్స్ తో పాటు అంతా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న తరుణం.. ఇప్పటికే రిలీజైన ఆడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పటికే అజ్ఞాతవాసిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 

ఇంతగా హైప్ క్రియేటైన అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ ఇంకా ఎందుకు ఆలస్యమవుతోంది. కనీసం ఎప్పుడొస్తుంది అనే దానిపై కూడా క్లారిటీ లేదు. నేడో.. రేపో.. ట్రైలర్ విడుదల ఖాయమన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. నిజానికి ట్రైలర్ ఇప్పటికే కట్ చేసి సిద్దం చేసినప్పటికీ.. రిలీజ్ చేయడానికి మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ తటపటాయిస్తున్నారట. ఇంతకీ ఆ కారణమేంటీ..

 

ఫ్రెంచ్ దర్శకుడు జెరోం సల్లే దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్రెంచ్ మూవీ 'లార్గో వించ్' సినిమాకు అజ్ఞాత‌వాసి కాపీ అన్న ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ విడుదల చేసినప్పటి నుంచి ఈ ప్రచారం జోరందుకుంది. అయితే ఇప్పుడు ట్రైలర్ కూడా విడుదలైతే ఆ ప్రచారం మరింత ఊపందుకుంటుందని త్రివిక్రమ్ భయపడుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో సీన్లకు లార్గో వించ్ తో పోలికలు ఉంటే.. కాపీ అన్న ముద్ర పడిపోవడం ఖాయమంటున్నారు.

 

కాపీరైట్ వివాదం చెలరేగుతుందనే భయం వల్లే ట్రైలర్ కట్ చేసి సిద్దంగా ఉంచినా.. విడుదల చేయడానికి మాత్రం త్రివిక్రమ్ ధైర్యం చేయట్లేదట.

 

అయితే ట్రైలర్ ఎలాగూ రిలీజ్ చేయక తప్పదు కాబట్టి.. నేడో.. రేపో.. అజ్ఞాత‌వాసి ట్రైలర్ విడుదల చేస్తారని అంటున్నారు. అయితే అది ఏ సమయంలో అన్నది త్రివిక్రమ్ మూడ్‌పై ఆధారపడి ఉంటుందట. ఆయన ఎప్పుడు ఓకె అంటే అప్పుడు యూట్యూబ్ లో ట్రైలర్ దర్శనమిస్తుందన్నమాట. మరి ఈ రెండు రోజుల్లో కూడా అజ్ఞాత‌వాసి ట్రైలర్ రిలీజ్ చేయకపోతే.. కాపీ ఆరోపణలకు త్రివిక్రమ్ ఊతమిచ్చినవారవుతారు.

 

ఇక ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ డైరెక్టర్ జెరోం సల్లె కూడా అజ్ఞాత‌వాసి సినిమా చూడాలనుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా చెప్పిన సంగతి తెలిసిందే. మరు హక్కులు దక్కించుకున్న టి-సిరీస్ విషయాన్ని తేలుస్తుందా?  లేదా అన్నది చూడాలి. ఎటొచ్చీ పవన్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావటం మాత్రం ఖాయం. మరి ఏం చేస్తారో చూడాలి.

click me!