Sarkari Vaari Pata : ‘సర్కారు వారి పాట’ నుంచి రేపే బిగ్ అనౌన్స్ మెంట్..!? ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 25, 2022, 01:38 PM ISTUpdated : Jan 25, 2022, 01:39 PM IST
Sarkari Vaari Pata : ‘సర్కారు వారి పాట’ నుంచి రేపే బిగ్ అనౌన్స్ మెంట్..!?  ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..

సారాంశం

ఏడాదిగా షూటింగ్ జరుపుకుంటున్న ‘సర్కారు వారి పాట’ మూవీ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ  నుంచి రేపు ఒక బిగ్ అనౌన్స్ మెంట్ రానుందట..!  

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీకి సంబంధించిన తాజా అప్డేట్ రేపో, ఎల్లుండో రానున్నట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఈ రోజుకు సరిగ్గా ఏడాది పూర్తైంది. కాగా సినిమా నుంచి ఏడాది కిందనే మోషన్  పోస్టర్ అండ్ విడుదల చేశారు. అప్పటి నుంచి షూటింగ్ పనులు చకచక కొనసాగుతూ వచ్చాయి. ఆ తర్వాత మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియోతోనే అభిమానులు ఇప్పటి వరకు సరిపెట్టుకున్నారు. 

తాజాగా, రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ‘సర్కారు వారి పాట’ మూవీ సాంగ్స్ కంపోసింగ్ ను కూడా షూర్ చేసినట్టు సోషల్ మీడియా వేదికన తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  రేపో, ఆ మరునాడో ఈ మూవీని ఫస్ట్  సింగిల్ అప్డేట్ రానుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాల సర్కారు వారి పాట మూవీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

అయితే కొంత మంది అభిమానులు మాత్రం రేపు పక్కా అప్డేట్ ఉంటుందంటూ చెబుతున్నారు. ఇక ఫ్యాన్స్ ఊహించినట్టు రేపు ఎలాంటి అప్డేట్ వస్తుందో వేచి చూడాలి. బ్యాకింగ్ రంగం నేథప్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మహేశ్ బాబు కేరీర్ లో మరో మైలు రాయిలా నిలిచిపోతుందటూ  అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. 

కాగా, ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ నుంచి అధికారింగా ఎలాంటి అప్డేట్ మాత్రం అందలేదు. నిజానికి ఈ మూవీపై ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడూ ఏ అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. పరుశురామ్ పెట్ల, మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ ఆడిపాడనుంది.   

PREV
click me!

Recommended Stories

Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ