Mahesh Babu: ప్రి రిలీజ్ పంక్షన్ లో మహేష్ అన్న మాటలే నిజమవుతున్నాయా?

By Surya PrakashFirst Published May 16, 2022, 5:52 PM IST
Highlights

పరశురాం దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేష్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజైంది.


హీరోలు అభిమానులు ఎప్పుడు ఏ అవకాసం దొరుకుతుందా తమ హీరో గురించి మాట్లాడటానికి అని ఎదురుచూస్తూంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా లలో ఫ్యాన్స్ హంగామా ఓ రేంజిలో ఉంటూంటుంది. మహేష్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట విషయంలో మొదట భీబత్సంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఈ చిత్రాన్ని చూసిన జన్యూన్ ఆడియన్స్ మంచి మెసేజ్ ఇచ్చారు.. మహేష్ బాబు ఆకట్టుకున్నారని ప్రశంసలు కురిపిస్తే   కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొందరు యాంటి ఫ్యాన్స్  మాత్రం ‘సర్కారు వారి పాట’పై దుష్ప్రచారానికి తెగబడ్డాయి. అయితే ఈ సినిమాకు ఆ నెగిటివ్ టాక్ పెద్దగా ఇంపాక్ట్ చేయలేకపోయింది. దాంతో ప్రీ రిలీజ్ పంక్షన్ లో మహేష్ బాబు అన్న మాటలే నిజం అయ్యాయంటూ ఫ్యాన్స్ ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇంతకీ మహేష్ ఏమన్నారు...

మహేష్ మాట్లాడుతూ..‘‘సర్కారువారి పాట’లో నా పాత్రని ఎక్స్‌ట్రార్డినరీగా తీర్చిదిద్దిన పరశురాంగారికి థ్యాంక్స్‌.. నాకు ఇష్టమైన పాత్రల్లో ఇదొకటి. ఈ సినిమాని చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాను.. కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ‘పోకిరి’ రోజులు గుర్తొచ్చాయి’’ అని మహేశ్‌బాబు అన్నారు.  

అలాగే  ‘‘పరశురాంగారి కథ విని ఓకే చెప్పాను. ఆయన ఇంటికెళ్లిన తర్వాత.. ‘‘థ్యాంక్యూ సార్‌.. ‘ఒక్కడు’ చూసి డైరెక్టర్‌ అవుదామని హైదరాబాద్‌ వచ్చాను.. మీతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు.. చూడండి ‘సర్కారు వారి పాట’ని ఎలా తీస్తానో.. ఇరగదీస్తాను’’ అని మెసేజ్‌ పెట్టారు. ‘థ్యాంక్యూ సార్‌. ఈరోజు మా నాన్నగారు (కృష్ణ), నా అభిమానులకు మీరు వన్నాఫ్‌ ది ఫేవరెట్‌ డైరెక్టర్స్‌.

ఈ సినిమాలో చాలా హైలెట్స్‌ ఉంటాయి. వాటిలో హీరో హీరోయిన్‌ ట్రాక్‌ ఒకటి. ఈ ట్రాక్‌ కోసమే రిపీట్‌ ఆడియన్స్‌ ఉంటారు.. కచ్చితంగా.. రాసిపెట్టుకోండి. తమన్‌ నేపథ్య సంగీతానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమాకి ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌ బెస్ట్‌ వర్క్‌ ఇచ్చారు. ‘సర్కారువారి పాట’ సినిమా ‘పోకిరి’ని దాటుతుందని ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌గారు అనేవారు. ‘శ్రీమంతుడు’ సినిమాని ఎంత బాగా తీశారో ఈ సినిమాని అంతకంటే బాగా తీసిన కెమెరామేన్‌ మదిగారికి థ్యాంక్స్‌.

‘శ్రీమంతుడు, దూకుడు’ లాంటి బ్లాక్‌బ్లస్టర్స్‌ ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్‌.. మన కాంబినేషన్‌లో ‘సర్కారువారి పాట’ ఇంకో మరచిపోలేని బ్లాక్‌ బస్టర్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.  

click me!